Best Offers And Heavy Discounts On BS4 Cars బిఎస్-4 ఇంజన్ వాహనాలపై భారీ డిస్కౌంట్లు.. ఎందుకంటే..

Best offers and heavy discounts on bs4 cars

BS lV Engine, BS Vl Engine, cars, discount prices, best offers, technology, supreme court, bikes hyundai creta, renault duster, hyundai venue, mahindra alturas, nissan kicks, honda cr-v, compact suv, full size suv, honda crv, jeep compass, mid size suv, new cars, tata hexa, tata nexon

Most dealers across the country are looking to clear their unsold inventory. The stock includes unsold cars from the previous year and ones that are compliant with BS4 emission norms.

బిఎస్-4 ఇంజన్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఎందుకంటే..

Posted: 03/02/2020 02:42 PM IST
Best offers and heavy discounts on bs4 cars

దేశవ్యాప్తంగా బీఎస్–4 వాహనాలను ధర తగ్గించి అమ్ముతున్నారు. కార్ల వంటి ఫోర్ వీలర్స్ మాత్రమేకాకుండా ద్విచక్ర వాహనాలు కూడా తక్కువ ధరకు ఇస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బీఎస్‌-4 (భారత్ స్టేజీ 4) కేటగిరీ వాహనాలు విక్రయించవద్దని.. బీఎస్‌-6 వాహనాలు మాత్రమే అమ్మాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఉన్న బీఎస్‌-4 వాహనాల స్టాక్ ను అమ్మేసుకునేందుకు డీలర్లు ధరలు తగ్గిస్తున్నారు.

అప్పుడు బైకులు.. ఇప్పుడు కార్లు..
దేశవ్యాప్తంగా బీఎస్–3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లకు పెట్టిన గడువు ముగిసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. సుప్రీంకోర్టు గడువు పెంచుతుందేమోనన్న ఆశతో చాలా మంది డీలర్లు స్టాక్ ఉంచుకున్నారు. అయితే కోర్టు గడువు ఇవ్వకపోవడంతో ఉన్న వాహనాలను అమ్ముకునేందుకు భారీగా డిస్కౌంట్లు ప్రకటించారు. ద్విచక్ర వాహనాలను అయితే ఏకంగా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తగ్గించి ఇచ్చారు. దాంతో జనం షోరూమ్ ల ముందు బారులు తీరారు. కొన్ని చోట్ల పోలీసులను కూడా రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఇప్పుడు మరీ అలాంటి పరిస్థితి రాకపోయినా వాహనాలపై డిస్కౌంట్లు మాత్రం మొదలయ్యాయి.

‘బీఎస్‌-6’ ప్రమాణ విశేషాలు
వాహనాల్లో ఇంధన వినియోగ సామర్థ్యం, కాలుష్యం విడుదలకు సంబంధించిన ప్రమాణాలే బీఎస్ (భారత్ స్టేజీ) కేటగిరీలు. మన దేశంలో 2000వ సంవత్సరంలో ఈ ప్రమాణాలను అమలు చేయడం మొదలుపెట్టారు. మొదట ఆ ఏడాది బీఎస్‌–1  కేటగిరీ నిబంధనలు తెచ్చారు. 2010 నాటికి బీఎస్‌–3 నిబంధనలు అమలు చేశారు. తర్వాత చాలా జాప్యం జరిగింది. దానిపై సుప్రీంకోర్టులో కేసులు పడటంతో 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్‌–4 వాహనాలను తప్పనిసరి చేయాలని ఆదేశించింది. అంతేగాకుండా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు బీఎస్–5ను తప్పించి.. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేరుగా బీఎస్–6 నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. బీఎస్–4 తో పోలిస్తే బీఎస్–6 వాహనాలు పదో వంతు సల్ఫర్ ను, ఐదో వంతు మాత్రమే నైట్రోజన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయి.

ఏ కంపెనీలు ఎంత వరకు?

కారు పేరు ధర రేంజ్ డిస్కౌంట్ ఇంజన్ టైప్
టాటా బోల్ట్ రూ.5.29 నుంచి రూ. 7.87 లక్షలు రూ.75000 బిఎస్ 4
టాటా టైగర్ డీజిల్ రూ.6.59 లక్షల నుండి రూ.7.86 లక్షలు రూ.75000 బిఎస్ 4
టాటా జెస్ట్ రూ.5.89 లక్షల నుంచి రూ .9.89 లక్షలు రూ .85,000 బిఎస్ 4
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 రూ.6.05 లక్షల నుండి రూ.6.57 లక్షలు రూ.75000 బిఎస్ 4
హ్యుందాయ్ xcent రూ.5.81 లక్షల నుంచి రూ .8.79 లక్షలు రూ.95,000 బిఎస్ 4
హ్యుందాయ్ వెర్నా రూ.8.18 లక్షల నుంచి రూ .14.08 లక్షలు రూ.90,000 బిఎస్ 4
స్కోడా వేగంగా రూ.8.82 లక్షల నుంచి రూ .1244 లక్షలు రూ .1.60 లక్షలు బిఎస్ 4
హోండా సిటీ రూ.9.91 లక్షల నుండి రూ.14.21 లక్షలు రూ.72,000

బిఎస్ 4/బిఎస్ 6 (p)

హోండా సివిక్ రూ.17.94 లక్షల నుండి రూ.22.35 లక్షలు రూ .2.5 లక్షలు బిఎస్ 4
హ్యుందాయ్ ఎలంట్రా   రూ .2.5 లక్షలు బిఎస్ 4
హ్యుందాయ్ ఎలంట్రా రూ.15.89 నుంచి రూ .20.39 లక్షలు రూ. లక్ష బిఎస్ 6
స్కోడా అష్టావియా రూ.19 లక్షల నుంచి రూ .23.60 లక్షలు రూ .2.4 లక్షలు బిఎస్ 4
స్కోడా సూపర్బ్ రూ.28.50 లక్షల నుంచి రూ .31 లక్షలు రూ .2.5 లక్షలు బిఎస్ 4
       
మారుతి విటారా బ్రెజ్జా డీజిల్ రూ.7.62 లక్షల నుంచి రూ.10.59 లక్షలు రూ .86,200 బిఎస్ 4
నిస్సాన్ కిక్స్ రూ. 9.55 లక్షల నుండి రూ.13.69 లక్షలు రూ .1.60 లక్షలు బిఎస్ 4
హ్యుందాయ్ క్రెటా 1.6 రూ.10 లక్షల నుంచి రూ. 15.72 లక్షలు రూ .1.15 లక్షలు బిఎస్ 4
హోండా BR-V రూ.9.53 లక్షల నుండి రూ.13.83 లక్షలు రూ. 1.1 లక్షలు బిఎస్ 4
హ్యుందాయ్ టక్సన్ రూ.18.76 లక్షల నుండి రూ.26.97 లక్షలు రూ .2.50 లక్షలు బిఎస్ 4
హోండా CR-V రూ.28.27 నుంచి రూ .32.77 లక్షలు రూ .5 లక్షలు బిఎస్ 4
టాటా హెక్సా రూ.13.70 లక్షల నుంచి రూ .19.28 లక్షలు రూ .2.15 లక్షలు బిఎస్ 4
టాటా హారియర్ రూ.13.69 లక్షల నుంచి రూ.17.70 లక్షలు రూ .1.4 లక్షలు బిఎస్ 4
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 రూ. 8.10 లక్షల నుంచి రూ.12.69 లక్షలు రూ.79,500

బిఎస్ 4/బిఎస్ 6 (p)

మహీంద్రా మరాజో రూ. 9.99 లక్షల నుండి రూ.14.76 లక్షలు రూ .1.66 లక్షలు బిఎస్ 4
మహీంద్రా ఎక్స్‌యూవీ 500 రూ .12.22 లక్షల నుంచి రూ.15.55 లక్షలు రూ.1.04 లక్షలు బిఎస్ 4
మహీంద్రా స్కార్పియో రూ .10.16 లక్షల నుంచి రూ.16.37 లక్షలు రూ.79,400 బిఎస్ 4
మహీంద్రా అల్టురాస్ జి 4 రూ .27.70 లక్షల నుంచి రూ.30.70 లక్షలు రూ 3.05 లక్షలు బిఎస్ 4
మహీంద్రా టియువి 300 రూ .8.54 లక్షల నుంచి రూ.10.55 లక్షలు రూ.91,750 బిఎస్ 4
రెనాల్ట్ డస్టర్ (ప్రీ/ఫేస్ లిఫ్ట్) రూ.7.99 లక్షల నుండి రూ. 12.50 లక్షలు రూ .2 లక్షలు బిఎస్ 4
రెనాల్ట్ కాప్టూర్ రూ. 9.50 లక్షల నుంచి రూ .13 లక్షలు రూ .2.40 లక్షలు బిఎస్ 4
రెనాల్ట్ లాడ్జీ రూ. 8.63 లక్షల నుంచి రూ.12.12 లక్షలు రూ .2.10 లక్షలు బిఎస్ 4
స్కోడా కోడియాక్ 36.79 లక్షల రూపాయలు రూ .2.37 లక్షలు బిఎస్ 4

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BS lV Engine  BS Vl Engine  cars  discount prices  best offers  technology  supreme court  bikes  

Other Articles