Luxembourg makes all public transport free ఉచితంగా ప్రజారవాణా.. ప్రపంచంలోనే తొలి దేశం..

Luxembourg is first country to make all public transport free

Luxembourg, free transport in Luxembourg, free public transport, Luxembourg transport, Luxembourg transport free, night travels, first class travel, petroleum products, cars, busses, trains, tramps, people transport, free mobility

It has had months of hype and now finally Luxembourg's free public transport has begun. With a population of only 614,000, it may be one of Europe's smallest countries and the idea is not unprecedented. But the "free mobility" drive has captured the imagination. Buses, trams and trains are now free to ride on and you don't need a ticket.

ఉచితంగా ప్రజారవాణా.. ప్రపంచంలోనే తొలి దేశం..

Posted: 02/29/2020 04:44 PM IST
Luxembourg is first country to make all public transport free

యూరోప్ ఖండంలోని అతిచిన్న దేశమైన లగ్జెంబర్గ్‌.. ప్రజా రవాణాను ఉచితం చేసేసింది. ఇక ఈ దేశంలోని రైలు, మెట్రోలు, బస్సుల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఈ వార్త వినగానే మన దేశంలో కూడా ప్రజా రవాణాను కనీసం రైలు ప్రయాణాలను ఉచితం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు కదూ. లగ్జెంబర్గ్ ప్రజలు తీవ్ర వాయు కాలుష్యంతో రద్దీ సమయాల్లో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌లను చవిచూస్తున్న కారణంగా ఆ దేశం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంలో భాగంగా ప్రజలందరికీ ఉచిత రవాణా సౌకర్యం అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 29 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆ దేశ రవాణా మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోనే ఇలాంటి సౌకర్యం కల్పిస్తున్న తొలి దేశం లగ్జెంబర్గే కావడం విశేషం. ఈ నిర్ణయం వల్ల ప్రతి వ్యక్తికి ఏటా దాదాపు 100 యూరోలు ఆదా అవుతుందట. అయితే ఈ ఉచిత ప్రజా రవాణా వ్యవస్థలో కొన్ని సేవలను మినహాయించారు. రైళ్లలో ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణం, రాత్రి వేళల్లో బస్సు సర్వీసులకు ఈ ‘ఉచితం’ వర్తించదు.   

లగ్జెంబర్గ్‌.. యూరోప్ దేశాలలో అత్యంత చిన్నదేశ కావడంతో పాటు ఈ దేశంలో జనాభా కూడా కేవలం ఆరు లక్షల 14 వేలు మాత్రమే. అయితే బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల మధ్య నెలకొన్న ఈ దేశానికి ప్రతినిత్యం ఈ మూడు దేశాల పౌరులు ఉద్యోగ, ఉఫాధి సహా ఇతర పనుల నిమిత్తం సుమారు రెండు లక్షల మంది వస్తుంటారు. అయితే వీరంతా సొంత వాహనాల్లో వచ్చివెళ్లడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు వాయు కాలుష్య సమస్యను ఆ దేశం ఎదుర్కోంటోంది. అయితే ఈ ఉచిత రవాణతో ఈ సమస్యకు చెక్ పడుతుందా.? అంటే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.

ఇందుకు ప్రధాన కారణం.. పోరుగు దేశాలతో పోల్చితే లగ్జెంబర్గ్ లో ఇంధన ధరలు చాలా తక్కువ. దీంతో పోరుగు దేశాలకు చెందిన వ్యక్తులు కూడా తమ పనులుంటే ఇక్కడి సొంత వాహనాల్లోనే వచ్చి తిరిగి వెళ్లేప్పుడు తమ కార్లలో ఇంధనాన్ని ఫుల్ చేసుకుని వెళ్తుంటారు. దీనికి తోడు.. లగ్జెంబర్గ్ దేశంలో ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా వున్నాయి. అయితే ఇంధన ధరలు మాత్రం చాలా తక్కువగా వున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు కూడా సొంత వాహనాల్లో ప్రయాణాలనే ఇష్టపడుతుండటం గమనార్హం. దీంతో ఈ దేశంలో ప్రతి వెయి మందిలో 700 మందికి కార్లు వున్నాయని అక్కడి గణంగాకలు స్పష్టం చేస్తున్నాయి.

2018లో చేపట్టిన ఓ సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 32శాతం మంది బస్సుల్లో, 19శాతం మంది మాత్రమే రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు తేలింది. మిగతా వారంతా తమ ప్రయాణాలకు కార్లు, సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీంతో కాలుష్య స్థాయిలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో లగ్జెంబర్గ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్‌ ఖర్చు లేకపోతే ప్రజలంతా ప్రజా రవాణాను ఉపయోగిస్తారని అక్కడి అధికారులు భావించి ఈ ఉచిత రవాణాను అందుబాటులోకి తెచ్చారు. మరి ప్రభుత్వ నిర్ణయం కాస్తానా ట్రాఫిక్, వాయు కాలుష్య సమస్యకు ఉపశమనం కలిగిస్తుందా.? లేదా.? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles