JDU expels Prashant Kishor for 'anti-party' activities పీకేపై సీఎం సంచలన వ్యాఖ్యలు.. పవన్ తోపాటుగా వేటు

Prashant kishor pavan varma expelled by jdu for indiscipline

Prashant Kishor, JD(U), CAA, Pavan Varma, Nitish Kumar, NRC, Janata Dal United, Lalu Prasad Yadav, susheel modi, Amit Shah, Bihar, Politics

The JD(U) expelled vice-president Prashant Kishor and general secretary Pavan Kumar for their "anti-party" activities. Both the leaders have been attacking the party leadership over its pro-CAA stand.

పీకేపై సీఎం సంచలన వ్యాఖ్యలు.. పవన్ సహా పార్టీ నుంచి ఔట్..

Posted: 01/29/2020 03:51 PM IST
Prashant kishor pavan varma expelled by jdu for indiscipline

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరన్న విషయం మరోమారు నిరూపితమైంది. అందులోనూ బీహార్ రాష్ట్రంలో జేడీయూ పార్టీని అధికార పీఠంపై పలు మార్లు ఎక్కించడంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ పార్టీ అధినేత, బీహార్ ముక్యమంత్రి నితీష్ కుమార్ వేటు వేశారు. పార్టీ క్రమశిక్షణా చర్యలను వీడి వెళ్తున్న సందర్భంగానే ఆయనపై వేటువేసినట్లు నితీష్ కుమార్ తెలిపారు.

ప్రశాంత్ కిశోర్ తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ పై కూడా వేటు వేశారు. వీరిద్దరూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారన్న నేపథ్యంలో నితీష్ కుమార్ వీరిరువురిపై వేటు వేశారు. గత కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ కు సీఎం నితీష్ కుమార్ కు మధ్య కొంత అగాధం చోటుచేసుకుంది. ఇటీవల ఆయన సీఏఏ సహా ఎఆర్సీలను వ్యతిరేకించి.. ఆయా ర్యాలీలకు అనుకూలంగా స్టేట్ మెంట్లు ఇచ్చిన సమయంలోనూ అమిత్ షాను టార్గెట్ గా చేసుకుని పలు వ్యాఖ్యలను చేశారు. అప్పుడే నితీష్ తో కొంత కోల్డ్ వార్ నడుస్తుందని కూడా వార్తలు వచ్చాయి.

అయితే సీఏఏ, ఎన్ఆర్సీలను సమర్థిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు పీకే తన రాజీనామాను కూడా సమర్పించారని.. దానిని నితీష్ తిరస్కరించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి మధ్య ఎక్కడ బెడిసికొట్టిందో కానీ నిన్న బహిరంగంగా నితీష్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యంపోసాయి. ఇక పార్టీకి ఉపాధ్యక్షుడిగా వున్న ప్రశాంత్ కిషోర్ తో పాటుగా ప్రధాన కార్యదర్శిగా వున్న పవన్ కుమార్ పై కూడా వేటు వేస్తూ జేడీయు నిర్ణయం తీసుకుంది. పార్టీకి ఆయువుపట్టులా వున్న నేతలను వెలివేయడం సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే.. దేశవ్యాప్తంగా పౌరసవరణ చట్టం, జాతీయ పౌర గణనలను వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ప్రశాంత్ కిషోర్.. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సింహభాగం సీట్లు తమకు కేటాయిస్తేనే బీజేపీతో పొత్తు లేకుంటే లేదు అన్నట్లు ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్ఆర్సీ వంటి విషయాల్లో మిత్రపక్షం బీజేపీపైనే యుద్ధానికి దిగుతుండటం,కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను వినిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ వైఖరిపై నితీష్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఎన్నికల విషయంలో ఏకంగా బీజేపీలో నెంబర్-2గా ఉన్న అమిత్ షాపైనే ఎదురుదాడికి దిగిన ప్రశాంత్ కిషోర్ ను ఇక పార్టీ నుంచి సాగనంపాలని నిర్ణయించినట్లు  నితీష్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. సోమవారం పార్టీ నాయకులు,ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత నితీష్ కుమార్ మాట్లాడుతూ...ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉంటే ఓకే...వెళ్లిపోయినా కూడా ఓకే. ఎవరైనా ఇష్టమున్నంతకాలం పార్టీలో ఉండవచ్చు. పార్టీ వదిలివెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు. మాది వేరే రకమైన పార్టీ. అతను అసలు పార్టీలో ఎలా చేరాడో తెలుసా? ప్రశాంత్ ను పార్టీలో చేర్చుకోమని అమిత్ షా నాకు చెప్పాడు. అతని మనసులో ఏదో ఉండిఉండవచ్చు. అది పార్టీ వదిలిపోవాలనుకోవడం కావచ్చు.

ఇప్పటికే ఆయన వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.కానీ నేను ఒక విషయం సృష్టంగా చెబుతున్నాను. జేడీయూ పార్టీలోనే ప్రశాంత్ కిషోర్ ఉండాలనుకుంటే పార్టీ అతను పార్టీ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని అవలంబించాల్సి ఉంటుందని నితీష్ కుమార్ అన్నారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ పొత్తును విమర్శించిన జేడీయూ నాయకుడు  పవన్ వర్మ తీరును నితీశ్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. తనతో వ్యక్తిగత సంభాషణలను బాహాటంగా వెల్లడించిన పవన్‌కు తన ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తూ, ఆయన పార్టీ మారాలనుకుంటే, వెళ్ళిపోవచ్చునని చెప్పారు.

ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడాన్ని బట్టి చూస్తుంటే వాళ్లని పొమ్మనక పొగబెట్టినట్లుగా ఇవాళ ఉధయం వరకు ఉన్న పరిస్థితులను మరింతగా క్లారిటీ వచ్చేలా చేశారు నితీష్ కుమార్. పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ లపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందునే ఈ చర్యలకు పార్టీ పూనుకుందని కూడా చెప్పారు. అయితే దీనిపై స్పందించిన ప్రశాంత్ కిషోర్ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్.. వెస్ట్ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహకర్తగా పనిచేసేందుకు ఇప్పటికే అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles