Three Indian-Americans jailed for call centre fraud విదేశీ కాల్ సెంటర్లపై అమెరికా న్యాయపోరాటం

Us files lawsuit against overseas call centres for making fake robocalls

Call centre fraud, lawsuits, massive financial losses, Indian-Americans, Mohamed Kazim Momin, Mohmed Sozab Momin, Palak Kumar Patel, Internal Revenue Service (IRS), Georgia, US, Ahmedabad, Uttar Pradesh, India, latest news, National news, India news

Three Indian-Americans are among eight people sentenced by a US court for their roles in a sophisticated India-based call centre fraud scheme that defrauded thousands of Americans, resulting in over USD 3.7 million in losses.

విదేశీ కాల్ సెంటర్లపై అమెరికా న్యాయపోరాటం.. భారత్ కు చెందినవే అధికం..

Posted: 01/29/2020 02:59 PM IST
Us files lawsuit against overseas call centres for making fake robocalls

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ ఫీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. అంటూ రాయప్రోలు రాసిన పాటను కూడా అలకించకుండా.. సప్త సముద్రాలు దాటి వెళ్లినా.. మోసం, దగా, కుట్రలతో కూడిన జీవనం సాగిస్తున్న ఘనుల ఉదంతమిది. మనవారిని దోచేస్తే కేవలం రూపాయలు.. అదే అమెరికావాసులను దోచేస్తే డాలర్లు అనుకున్నారో ఏమోగానీ.. ఈజీ మని వేటలోపడి అగ్రరాజ్యం పోలీసులకు అడ్డంగా చిక్కి.. కటకటాలు లెక్కపెడుతున్నారు ముగ్గురు భారతయులు.

ఫలితంగా అగ్రరాజ్యం అమెరికా ఏకంగా మూడు కాల్ సంటర్ కంపెనీలతో పాటు ముగ్గురు వ్యక్తులపై అక్కడి న్యాయస్థానంలో కేసులు వేసింది. ఇప్పటికే పలుమార్లు వారిని రెడ్ నోటీసులు ఇచ్చి హెచ్చిరించినా.. ఫలితం లేకుండా పదే పదే వారు అమెరికన్లను టార్గెట్ చేస్తూ.. కాల్స్ చేయడం.. తమను తాము ప్రభుత్వ, వ్యాపార సంబంధిత కాల్ సెంటర్ వ్యక్తులుగా పేర్కోని పెద్దఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని పిర్యాదు చేశారు. కాగా వీటిలో అధికంగా భారత్ నుంచి వస్తున్న కాల్స్అని అమెరికా న్యాయవిభాగం గుర్తించింది.

ఈ సారి అమెరికాలో ఈ మోసపూరిత కాల్ సెంటర్లకు అనుకూలంగా పనిచేస్తున్న వారిని కూడా అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ కాల్ సెంటర్లను పూర్తిగా విచారించి చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించడంతో పాటు వారు కొనసాగిస్తున్న సేవలను తక్షణం నిలిపివేసేందుకు కూడా అనుమాతి ఇవ్వాలని కోరింది. కాగా, కాల్ సెంటర్ పేరిట 37 లక్షల డాలర్ల (సుమారు రూ. 26.36 కోట్లు) మోసానికి పాల్పడిన కేసులో అమెరికాలో ముగ్గురు ఇండియన్స్ సహా ఎనిమిది మందికి జైలు శిక్ష పడింది. భారత్ కేంద్రంగా జరిగిన కాల్ సెంటర్ ఫ్రాడ్ గత సంవత్సరం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మోసంలో నష్టపోయింది అమెరికన్లే.

ఈ కేసులో జార్జియాలో నివాసం ఉంటున్న మొహమ్మద్‌ కాజిమ్‌ మొమిన్, మొహమ్మద్‌ సోజబ్‌ మొమిన్, పాలక్‌ కుమార్‌ పటేల్‌ లను అరెస్ట్ చేసిన అధికారులు, వారిపై చార్జ్ షీట్ దాఖలు చేయగా, కోర్టు విచారణ జరిపింది. వీరికి ఆరు నెలల నుంచి నాలుగు సంవత్సరాల 9 నెలల వరకు వేర్వేరుగా జైలు శిక్షలు విధించింది. డేటా బ్రోకర్ల నుంచి సమాచారం తీసుకుని, వారికి ఫోన్ చేసి, తాము ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌ ఉద్యోగులమని, మీరు ప్రభుత్వ పన్నులు చెల్లించలేదని, భారీ జరిమానా పడుతుందని భయపెట్టి, వారి నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఇందుకోసం అహ్మదాబాద్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని, ఇండియాలోని కొందరితో కలసి కుట్ర చేసి ఈ మోసానికి తెరలేపారని ప్రాసిక్యూషన్ కోర్టులో రుజువు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh