Congress sends Constitution copy to PM ప్రధాని మోడీకి కాంగ్రెస్ సర్ ప్రైజ్ గిప్ట్.. తిరస్కరణ

Congress sends pm a copy of constitution says read when you get free from dividing nation

PM Modi, Republic day, Read India Right, Narendra Modi, Central Secretariat, copy of the Constitution, BJP, Amazon, Congress, India, Politics

On the occasion of the 71st Republic Day, the Congress sent a copy of the Constitution to PM Modi and took a dig at him saying, “when you get time off from dividing the country, please do read it”. Congress tweeted the message along with a picture of an Amazon receipt being dispatched to the Central Secretariat.

ప్రధాని మోడీకి కాంగ్రెస్ సర్ ప్రైజ్ గిప్ట్.. తిరస్కరణ

Posted: 01/27/2020 03:38 PM IST
Congress sends pm a copy of constitution says read when you get free from dividing nation

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఊహించని విధంగా సర్ ప్రైజ్ గిఫ్ట్ ను పంపించింది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ద్వారా సెంట్రల్ సెక్రటేరియట్లోని ప్రధాని కార్యాలయానికి ఈ గిఫ్టుకు పంపింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన వివరాలను కూడా కాంగ్రెస్ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో పంపిన 170 రూపాయల విలువగల వస్తువును మరేదో కాదు... భారత రాజ్యాంగ పుస‍్తకం.

ఈ రాజ్యాంగ ప్రతిని మోడీకి పంపితూ కాంగ్రెస్ పార్టీ ప్రధానిపై పలు విమర్శలు చేసింది. ‘‘దేశాన్ని విభజించే ముందు రాజ్యాంగాన్ని ఓ సారి చదువుకోండి’’ అని కాంగ్రెస్ ట్వీట్‌ చేసింది. ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొంతకాలంగా ఆందోళనలకు కొనాసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీతో సహా వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎఆర్సీని కూడా వద్దంటున్నాయి.

‘‘మతం ఆధారంగా వ్యక్తులకు పౌరసత్వం కల్పించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని, ఈ కనీస పాఠాన్ని కూడా బీజేపీ నేర్చుకోలేకపోయిందని, కాబట్టే సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తోపాటు యావత్ దేశం ఆందోళనలను చేస్తొంద’’ని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ సమయంలో ప్రధాని మోడీకి రాజ్యాంగ ప్రతిని గిఫ్ట్‌గా పంపింది. అయితే ఈ పుస్తకాన్ని.. తాము అర్డర్ చేయలేదని ప్రధాని మంత్రి కార్యాలయం తిరస్కరించిందని సమాచారం.

గౌరవనీయులైన ప్రధాని గారు.. దేశాన్ని విభజించే పనిలో మీరు చాలా బిజీగా ఉన్నారని తెలుసు.. అయితే ఏకొంచెం టైమ్ దొరికినా ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.. ఇది మన భారత రాజ్యాంగం.. మన వ్యవస్థలన్నీ పనిచేసేది దీనిపైనే’  అంటూ కాంగ్రెస్ ట్విట్‌ చేసింది.  ఫొటోలతోపాటు కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు రాజ్యాంగ పీఠిక చదువుతోన్న వీడియోలను కూడా పార్టీ ట్విటర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. మరి ప్రధాని కార్యాలయం ఈ గిఫ్ట్‌ను స్వీకరించిందా లేక తిప్పి పంపిందా అనేది తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles