Jana Sena ties up with BJP in AP రానున్నది మా కూటమి ప్రభుత్వమే: పవన్ కల్యాణ్

Pawan kalyan s jana sena ties up with bjp in andhra pradesh

Janasena, Pawan Kalyan, pawan kalyan twitter, pawan kalyan BJP, bjp-jsp tie up, Pawan Kalyan Bharatiya Janata Party, Mangalagiri, Amaravati, shifting of capital, 29 Villages, Three Capitals, YSRCP Government, GVL Narasimha rao, Kanna Laxminarayana, JP Nadda, Tejaswi Surya, Nadendla Manohar, HighCourt, Kurnool, andhra pradesh, politics

In a major political development, BJP has decided to ally with Pawan Kalyan's Jana Sena Party (JSP) in Andhra Pradesh. The announcement came after a crucial meeting in Vijayawada. "BJP and JSP will work together to come to power in 2024 in AP Andhra Pradesh. We will work for the people of the state together."

రానున్నది బీజేపి-జనసేన కూటమి ప్రభుత్వమే: పవన్ కల్యాణ్

Posted: 01/16/2020 05:35 PM IST
Pawan kalyan s jana sena ties up with bjp in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త బంధం మొదలైంది. కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. బీజేపీ-జనసేన మధ్య చిగురించిన మైత్రిబంధం ఆ పార్టీలను కూటమిగా ఏర్పాటయ్యేలా చేసిది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన పని చేస్తాయని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. విజయవాడలో బీజేపీ-జనసేన కీలక నేతల మధ్య సుదీర్ఘ సమావేశం(మూడున్నర గంటలు) జరిగింది. కాగా రెండు పార్టీల మధ్య సక్యత కుదరింది కానీ విలీనం మాత్రం కాదని పవన్ కల్యాన్ తేల్చచెప్పారు.

రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపితో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై బీజేపి పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్ లో బీజేపి నేతలతో కీలక భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. బీజేపితో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామన్నారు.

టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. అప్పట్లో అవినీతిమయ పాలనతో, ఇప్పుడు పాలెగాళ్ల రాజ్యపాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. దీంతో ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. తమ ఈ నూతన కలయికకు అండగా నిలబడిన ప్రధాని మోదీ, అమిత్‌షాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  

గతంలో రాజకీయంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాజధానిగా అమరావతిని నిర్ణయించారని అన్నారు. ఇప్పుడు ఏకపక్షంగా తరలిస్తారని అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు పవన్. కులతత్వం, కుటుంబపాలనతో నిండిన రాజకీయ వ్యవస్థను మా కూటమితో ప్రక్షాళన చేస్తామన్నారు. అంతపెద్ద రాజధాని సాధ్యం కాదని అప్పుడే చెప్పా. 33వేల ఎకరాలు ఎందుకని అడిగా. ఇప్పుడు అవే అనుమానాలు నిజమయ్యాయి.. రైతులు రోడ్డున పడ్డారని అవేదన వ్యక్తం చేశారు. రాజధానిని తరలిస్తే రోడ్లపైకి రావడంతో పాటు న్యాయపోరాటం కూడా చేస్తామని అన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ

ఈ సమావేశంలో ఇరు పార్టీల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలోని పరిణామాలపై సమావేశంలో చర్చించామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.  ఎలాంటి షరతుల్లేకుండా తమతో కలిసి పనిచేయడానికి పెద్దమనసుతో ఆయన ముందుకొచ్చినందుకు పవన్‌ను ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విభజన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సామాజిక న్యాయం సాధించాలన్నా బీజేపి-జనసేనతోనే సాధ్యమన్నారు. రెండు పార్టీలూ 2024లో అధికారమే లక్ష్యంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కలిసి పోరాటం చేస్తామన్నారు.

సునీల్‌ దేవ్ ధర్‌

సంక్రాంతి సమయంలో బీజేపి-జనసేన మధ్య పొత్తు కుదరడటం శుభకరమని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ అన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇవాళ చరిత్రాత్మకమైన రోజని చెప్పారు. రాష్ట్రంలో చీకట్లు తగ్గి వెలుగులు పెరగనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని..వైకాపా, తెదేపాతో తమకు ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. సిద్ధాంతపరమైన ఏకాభిప్రాయంతోనే భాజపా-జనసేన మధ్య పొత్తు కుదిరిందని ఆయన స్పష్టం చేశారు.

జీవీఎల్‌ నరసింహారావు

ఏపీ రాజకీయాల్లో ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం జరిగిందని బీజేపి ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయడంలో రెండు పార్టీల కలయిక శుభ పరిణామంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జనసేనతో తప్ప ఏ ఇతర పార్టీలతోనూ బీజేపికి రాజకీయ సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నాలుగున్నర ఏళ్లపాటు ప్రజా సమస్యలపై ఫోకస్ చేసి.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతామన్నారు. బీజేపితో కలిసి పనిచేయాలని నిర్ణయించినందుకు పవన్‌కు జీవీఎల్‌ అభినందలు చెప్పారు. ఏపీలో అద్భుత రాజకీయ ఫలితాలు సృష్టించగలమని..అభివృద్ధినే ఆధారంగా చేసుకుని ఈ కూటమిని ప్రజలు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles