Capital punishment sought for Hajipur serial killer ‘హాజీపూర్‌’ నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరే సరి: పీపీ

Public procecutor pleades for death penalty to hajipur serial killer accused

Srinivasa Reddy, Hazipur, Kalpana, Maneesha, Shravani, sexual assault, Special Public Prosecutor, Chandrasekhar, rape, murder, Bommlaramaram, Yadadri-Bhongir, Nalgonda court, posco act, allegations on police, Telangana, Crime

During his argument in the First Additional District and Sessions Judge court, Special Public Prosecutor Chandrasekhar pleaded the judge for death penalty to Srinivas Reddy saying he should be eliminated from the society for the safety of girls and women.

‘హాజీపూర్‌’ నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరే సరి: పీపీ

Posted: 01/08/2020 05:06 PM IST
Public procecutor pleades for death penalty to hajipur serial killer accused

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ వరుస హత్యాచార కేసులతో తనకెలాంటి సంబంధం లేదని...కావాలనే పోలీసులు తనను ఇరికించారని తన వాదనలో అబద్దాలను బుకాయించిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి.. ఉరిశిక్ష సరైన శిక్ష అని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ ఇవాళ న్యాయస్థానంలో తన వాదనను బలంగా వినిపించారు. మైనర్ బాలికల స్వేచ్ఛా, అమాయకత్వాన్ని అసరగా చేసుకుని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి హత్యాచారం చేసిన చీడపురుగులను సమాజంలో ఉంచరాదని అన్నారు.

పోలీసులు తనకు ఇంజెక్షన్లు ఇచ్చి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారని, ఆ బాలికల హత్యలకు, తనకు సంబంధం లేదని ఈ నెల 3న నల్గొండలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానంలో వాదించిన నిందితుడు.. సాక్షుల వాంగ్మూలాలన్ని అబద్దాలుగా చెప్పుకోచ్చాడు. తన వద్ద ఫోన్లే లేవని ఒకసారి, చిన్న ఫోన్లు మాత్రమే వున్నాయని మరోసారి.. మరి స్మార్ట్ ఫోన్ల సిమ్ లు ఎందుకున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించడంతో తెల్లముఖం వేసుకుని మౌనంగా వుండిపోయిన విషయం తెలసిందే.

నిన్నటి విచారణ తరువాత ఇవాళ్టికి వాయిదా పడినే కేసు విచారణలో భాగంగా ఇవాళ ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి. కాగా ఇవాళ వాదనల సందర్భంగా హాజీపూర్ వరుస హత్యచార కేసుల్లోని నిందితుడైన శ్రినివాస్ రెడ్డికి మరణశిక్ష సరైందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ఆయన.. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకే కల్పన మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లను వెలికి తీశారని.. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారిని నిందితుడిగా అనుమానించవచ్చని, నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అన్ని విధాలా ఉరిశిక్షకు అర్హుడని పీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

మనీషా, కల్పన, శ్రావణి హత్యాచారకేసుల్లో 101 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసిన నేపథ్యంలో నిందితడు అభిప్రాయాలను నమోదు చేసిన న్యాయస్థానం.. ఢిఫెన్స్ తరపు వాదనలను కూడా నమోదు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో శ్రావణి, కల్పన, మనీషా అనే మైనర్ బాలికలను శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసి.. వారి మృతదేహాలను ఊరి చివర ఉన్న బావిలో పూడ్చి పెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీనిపై ప్రభుత్వం నల్గొండలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వేగంగా విచారణ నిర్వహిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles