Kodela Autopsy reprot not yet recieved: police కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకేసులో మరో ట్విస్టు..

No post mortem report received in kodela siva prasad suicide case hyderabad police

Kodela siva prasad rao, former assembly speaker, autopsy report, post-mortem report, banjara hills police station, hyderabad police, Andhra Pradesh, Telangana, crime

The Banjara Hills police said that they have not received the post-mortem report of former assembly speaker Kodela Siva Prasad Rao who committed suicide at his residence in Banjara Hills on September 16, 2019.

కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకేసులో మరో ట్విస్టు..

Posted: 12/16/2019 12:26 PM IST
No post mortem report received in kodela siva prasad suicide case hyderabad police

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన మరణానికి సంబంధించిన కేసులో తమకు ఇప్పటివరకూ పోస్టుమార్టం నివేదిక అందలేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. గత సెప్టెంబర్ 16న హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 7లోని తన నివాసంలో కోడెల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసింది. టీడీపీ సీనియర్ నేతగా కొనసాగుతున్న అయిన ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ వేధింపుల వల్లే ఆయన మరణించారంటూ టీడీపీ నేతలు ఆరోపించడంతో ఆయన మరణం రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు కూతురు, భార్య, గన్ మాన్ల వాంగ్మూలం నమోదు చేసి కేసు దర్యాప్తు చేశారు. ఇక ఈ నేపథ్యంలో కోడెల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, తాజాగా ఆయన మృతికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇప్పటివరకు తనకు అందలేదని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు వెల్లడించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.

ఈ కేసులో భాగంగా ఇప్పటికే పోలీసులు ఆయన కుటుంబసభ్యులను విచారించారు. అంతేకాకుండా ఆయన సెల్ ఫోన్ సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఘటన జరిగిన రోజు క్లూస్ టీమ్ సేకరించిన కొన్ని ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు మాత్రం దానికి సంబంధించిన రిపోర్ట్ యంత్రం తమకు అందలేదని ఏసీపీ కేఎస్ రావు వెల్లడించారు.  మూడు నెలలు గడుస్తున్నా.. పోస్టుమార్టం నివేదిక అందకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మరో పక్షం రోజుల వ్యవధిలో నివేదిక తమకు అందే అవకాశాముందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles