Man fined Rs. 9500 for hitting sampling మొక్కే కదా అని ఢీకొడితే.. జేబుకు చిల్లు పడింది..

Man fined rs 9500 for hitting sampling in telangana

Tata Sumo, Rajesh, vehicle owner, sampling, Haritha haram, Siddipet medical college, Samala Ailaiah, Siddipet, Telangana

A Tata Sumo owner was fined with Rs. 9500 for hitting a Haritha Haram Sampling at Siddipet medical college. Rajesh, car owner was fined by Haritha Haram official Samala Ailaiah.

మొక్కే కదా అని ఢీకొడితే.. జేబుకు చిల్లు..

Posted: 12/10/2019 01:29 PM IST
Man fined rs 9500 for hitting sampling in telangana

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో.. తొలినాళ్లలో విమర్శలను ఎదుర్కోన్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు కూడా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా నాటిన మొక్కల పరిరక్షణకు కూడా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇక ఈ మొక్కల విషయంలో అజాగ్రత్తగా ఎవరు వ్యవహరించినా వారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు.

హరితహారంలోని మొక్కలు, చెట్లను నరికేసిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఈ వివరాలు తెలియని ఓ యువకుడు హరితహారంలోని మొక్కను ఢీకొనడంతో అతని జేబుకు పెద్ద చిల్లు పడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు కారు యజమాని చేతి చమురును వదిలించారు. అంతేకాదు యావత్ రాష్ట్రంలోని ప్రజలకు ఒక సందేశాన్ని పంపించారు. హరితహారంలోని చెట్లను, మొక్కలకు నష్టం వాటిల్లేలా ఎలాంటి ఘటనలకు పాల్పడినా.. చేతి చమురు వదులుతుందన్న సంకేతాలను ఇచ్చారు.

ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట పట్టణంలోని వైద్య కళాశాల వద్ద ఓ మొక్కను టాటా సుమో వాహనం ఢీ కొట్టడంతో ఆ మొక్క పడిపోయింది. దీంతో ఆ కారు యజమాని రాకేశ్ కు హరితహారం అధికారి సామల్ల ఐలయ్య తొమ్మిది వేల ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. మొక్కలకు హాని కలిగిస్తే తప్పకుండా జరిమానా చెల్లించాల్సిందేనని అన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోన్న ఐలయ్యకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని పలు చోట్ల మొక్కలను పీకేసిన వారికి జరిమానాలు విధిస్తోన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles