'God Save India's Economy': Chidambaram ‘‘దేవుడా.. నీవే దేశఆర్థిక వ్యవస్థను కాపాడు’’

God save india s economy chidambaram on bjp mp s gdp remark

Nishikant Dubey, gross domestic product, gdp, Money laundering, chidambaram, Indian Economy, National Politics

Senior Congress leader and former finance minister P Chidambarm on Tuesday took a dig at the BJP over its MP Nishikant Dubey's remarks that the GDP has no relevance, saying "God save India's economy".

‘‘దేవుడా.. నీవే దేశఆర్థిక వ్యవస్థను కాపాడు’’: చిదంబరం

Posted: 12/03/2019 04:34 PM IST
God save india s economy chidambaram on bjp mp s gdp remark

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలు, బీజేపి నేతల వ్యాఖ్యలను కేంద్ర అర్థికశాఖ మాజీమంత్రి పి. చిదంబరం ఘాటుగా చురకలు అంటించారు. అంతేకాదు బీజేపి నేతలు తమ అసమర్థతను కూడా చాలా తెలివిగా సమర్థించుకుంటున్న తీరుపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడగలిగింది ఇక ఆ దేవుడు మాత్రమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

లోక్ సభలో ఆర్థిక విధానాలు, నెమ్మదించిన జీడీపీ తదితర అంశాలపై జరిగిన చర్చలో.. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను చిదంబరం తన ట్వీట్ లో ఊటంకించారు. జీడీపీ గణాంకాలు ఇకపై దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపకరించవని.. 1936కు ముందు ఎలాంటి జాతీయ స్థూల ఉత్పత్తి శాతాలు లేవని, అయినంతమాత్రన అప్పట్లో అభివృద్ది జరగలేదా అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకాలను పెంచడం, పర్సనల్ ట్యాన్స్ తగ్గించడం వంటి నిర్ణయాలను ఇప్పటికే వ్యతిరేకించిన చిదంబరం, తాజాగా నిషికాంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

కాగా, ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం, జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 4.5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఇకపై జీడీపీ గణాంకాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన దూబే, 1934 కన్నా ముందు ఏ జీడీపీ గణాంకాలు ఉన్నాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న చిదంబరం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ, సంస్కరణల అమలు దిశగా బీజేపీ ఏమీ చేయడం లేదని విమర్శలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles