Drunken Constable Hulchul Video Goes Viral మద్యంమత్తులో కానిస్టుబుల్.. సిఐకి మెమో..

Falaknuma drunken constable suspended after his video goes viral

police constable, Anjani kumar, suspension, Circle Inspector, Falaknuma, Hyderabad, Hyderabad police commissioner, constable video goes viral, constable hulchul on road, falaknuma constable anjani kumar, Telangana, Crime

A police constable was today placed under suspension after he was allegedly found in an inebriated state while on duty. The incident took place in Hyderabad. A police constable Eshwaraiah of Falaknuma Police Station created nuisance.

ITEMVIDEOS: మద్యంమత్తులో కానిస్టుబుల్.. సిఐకి మెమో..

Posted: 12/03/2019 01:37 PM IST
Falaknuma drunken constable suspended after his video goes viral

దిశ హత్యాచార కేసులో పోలీసులు సకాలం స్పందించలేదని.. తాము వెళ్లి పిర్యాదు చేసినా.. సీసీటీవీ ఫూటేజీలు చూస్తూ.. కాలాన్ని వెల్లదీసారని.. సకాలంలో స్పందించివుంటే.. తమ బిడ్డ తమకు దక్కేదని ఇప్పటికే దిశ తండ్రి, సోదరి, బంధువులు పోలీసులపై అరోపణలు గుప్పిస్తున్న తరుణంలో అదే శాఖకు చెందినవారు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇకపై తమ మూలాంగా తమ శాఖకు అవమానాలపాలు కాకూడదని వారు అలర్ట్ గా వుంటున్నారు. అయితే ఇవేవి నాకు పట్టవు అన్నట్లు వ్యవహరించి సస్సెన్షన్ వేటుకు గురయ్యాడు ఓ పొలీసు.

అయితే ఈ ఘటనతో అనేక మందికి కనువిప్పు కూడా కలుగుతోంది. కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. అతని ఉన్నతాధికారి ఏం చేస్తున్నాడంటూ పైఅధికారులకు కూడా అక్షింతలు పడ్డాయి. దీంతో పోలీసులు కమీషనర్ తీసుకున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. డిపార్టుమెంటులోనే కాదు సీపీ తీసుకున్న చర్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది.. అంటే.. హైదరాబాద్ లోని ఫలక్ నుమా పరిధిలో పూటుగా తాగిన ఓ కానిస్టేబుల్ చేసిన నిర్వాకమిది.

ఎంత తాగాడో తెలియదు కానీ.. నడిరోడ్డుపైనే వాహనాలకు ఆనుకుని కూర్చోని వాటిని కదలనీయకుండా తీవ్ర అంతరాయం కలిగించాడు. ఇదేం పనంటూ ప్రశ్నించిన వాహనదారులపై గొడవకు దిగాడు. ఘటన. మద్యం తాగిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య నడిరోడ్డుపై ఓ వాహనానికి ఆనుకుని పడుకున్నాడు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పక్కకి జరగమన్న వాహనదారులపై విరుచుకుపడి నానా హంగామా చేశాడు. చివరికి ఎలాగోలా అతడిని రోడ్డు పక్కకి పంపించారు. విషయం తెలిసిన కమిషనర్ అంజనీకుమార్ ఈశ్వరయ్యను సస్పెండ్ చేశారు. నడిరోడ్డుపై అంత జరుగుతున్నా  పట్టించుకోని ఫలక్‌నుమా సీఐకి మెమో జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles