Will Hiked Rates show impact on TSRTC దూరం అంతే.. బస్సులు అవే.. కానీ చార్జీలే తేడా..

Will hiked rates show impact on tsrtc

bus rates, hiked bus fares, bus passes, ordinary, metro express, metro delux, student bus pass, Commuters, passengers, Telanganites, political parties, Hyderabad, Telangana

Will hiked bus charges bring profits to TSRTC, while the same distance and same bus to other states places like amaravati, visakhapatna, shiridi, mumbai differs alot.

దూరం అంతే.. బస్సులు అవే.. కానీ చార్జీలే తేడా..

Posted: 12/03/2019 12:43 PM IST
Will hiked rates show impact on tsrtc

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త బస్సు చార్జీలు ఇవాళ్లి నుంచి అమల్లోకి రావడంతో దీనిపై తెలంగాణ ప్రయాణికుల నుంచి కొంత విముఖత వ్యక్తం అవుతోంది. కిలోమీటరుకు 20 పైసల మేరకు చార్జీలు పెరుగడంతో పాటు కనీస చార్జీలను కూడా పెంచడంతో దాని ప్రభావం ప్రయాణికులపై అధిక ప్రభావాన్నే చూపుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలు వెళ్లే బస్సులో మాత్రం ఈ తేడా కొట్టోచ్చినట్టు కనబడుతుంది. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరే బస్సుల్లో టీఎస్ఆర్టీసీ బస్సులను ఎక్కేందుకు ప్రయాణికులు విముఖత చూపించారు.

ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కర్నూలు, ముంబై, షిరిడీ, తిరుపతి ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా నమోదు అవుతుంది. అయితే ఇదే సమయంలో అవే ప్రాంతాలకు వెళ్లే ఇరత రాష్ట్ర బస్సు సర్వీసులు మాత్రం ప్రయాణికులో కిటకటలాడుతున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కళకళలాడటానికి, తెలంగాణ బస్సులు వెలవెలబోవడానికి కారణం లేకపోలేదు. హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సు చార్జీల్లో కొట్టోచ్చినట్టు కనబడుతున్న వత్యాతమే కారణం. చార్జీల పెంపు నేపథ్యంలో తెలంగాణ బస్సులకు స్పందన కరవైంది.

ఇక కొన్ని ప్రధాన రూట్లలో చార్జీలను పరిశీలిస్తే,
హైదరాబాద్ నుంచి విజయవాడకు
ఏపీఎస్ఆర్టీసీ                       టీఎస్ఆర్టీసీ
లగ్జరీ బస్సులో రూ. 317        లగ్జరీ బస్సులో రూ. 355
గరుడలో రూ. 467               రాజధానిలో రూ. 438
అమరావతిలో రూ. 544         గరుడలో రూ. 535
వెన్నెలలో రూ. 724

హైదరాబాద్ నుంచి కర్నూలుకు
ఏపీఎస్ఆర్టీసీ                        టీఎస్ఆర్టీసీ
లగ్జరీ బస్సులో రూ. 246          లగ్జరీ బస్సులో రూ. 288
అల్ట్రా డీలక్స్ లో రూ. 234         గరుడా ప్లస్ లో రూ. 429
ఇంద్రలో రూ. 310

హైదరాబాద్ నుంచి తిరుపతికి
ఏపీఎస్ఆర్టీసీ                       టీఎస్ఆర్టీసీ
లగ్జరీ బస్సులో రూ. 652        లగ్జరీ బస్సులో రూ. 694 (కడప మీదుగా)
అమరావతిలో రూ. 1,119      లగ్జరీ బస్సులో రూ. 748 (మాచర్ల, ఒంగోలు మీదుగా)
వెన్నెలలో రూ. 1,291          రాజధానిలో రూ. 892
                                    గరుడలో రూ. 1,104  

కాగా, తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, బాసర వంటి ప్రాంతాలకు తిరిగే ఏపీ బస్సుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. దీంతో తెలంగాణలోని ప్రాంతాలకు వెళ్లే వారు మాత్రమే టీఎస్ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారంతా ఏపీ బస్సుల కోసం వెతుక్కుంటున్నారు. ఆన్ లైన్ రిజర్వేషన్ లోనూ ఇదే పరిస్థితి. సమ్మె మొదలైన తరువాత ఆగిపోయిన తెలంగాణ ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్ వెబ్ సైట్ ఇవాళ ప్రారంభం అయింది. టికెట్ల బుకింగ్ ముఖ్యంగా ఏపీకి వెళ్లే బస్సుల్లో రిజర్వేషన్లు మందకొడిగా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bus rates  hiked bus fares  passengers  commuters  Telanganites  political parties  Hyderabad  Telangana  

Other Articles