TTD Impliments special darshan to below 5 year children ఐదేళ్లలోపు చిన్నారులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం..

Ttd impliments special darshan to below 5 year children from today

tirumala toddlers darshan, tirumala special darshan for toddlers, Tirumala Tirupati Devasthanam, TTD chairman YV SubbaReddy, Tirumala, Andhra Pradesh

Tirumala Tirupati Devasthanam board recently announced that it will provide special darshan to parents of toddlers who are below 5 years, and it implements its decision from today.

ఐదేళ్లలోపు చిన్నారులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం.. అమలుపర్చిన టీటీడీ..

Posted: 10/30/2019 10:27 AM IST
Ttd impliments special darshan to below 5 year children from today

తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ప్రకటించిన నిర్ణయాన్ని ఇవాళ్టి నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి అనునిత్యం వేలాధిమంది భక్తులు దేశనలుమూలల నుంచి తరలివస్తుంటారు. సప్తగిరులపై కొలువైన ఆ దేవదేవుని క్షణకాల దర్శనంతో తాము పడిన వ్యయప్రయాసలన్నీ మర్చిపోతుంటారు. అయితే తిరుమలకు వచ్చేవరకు ఓ ప్రయాస పడే భక్తులు.. ఇక్కడ దర్శనం చేసుకునేందుకు మరింతప్రయాస పడాల్సివస్తుంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో నిల్చొని పడిగాపులు కాస్తుంటారు.

అయితే భక్తుల అవస్థలను అర్థం చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భక్తులకు శీఘ్రంగా దర్శనం భాగ్యం కలిగేలా పలు ఏర్పాట్లు చేసినా.. వడ్డీ కాసుల వాడి వడ్డీని చెల్లించేందుకు భక్తుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతూ పోతొంది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తలు తిరుమల కొండపై కాస్త ఇబ్బంది పడాల్సిందే. కాగా వయో వృద్ధులు, చంటిపిల్లల తల్లులను ప్రత్యేక దర్శనం కల్పించేందుకు టీటీడీ సంకల్పించి.. ఆ కీలక నిర్ణయం ఇటీవల వెలువరించింది. చంటిబిడ్డలున్న తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కొన్ని ప్రత్యేక దినాల్లో టీటీడీ ఇప్పటికే కల్పిస్తుంది.

అయితే ఇప్పటివరకు కొనసాగిన ఏడాది వయస్సు బదులుగా ఐదేళ్ల ఐదేళ్లలోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు స్పెషల్ దర్శనం కల్పించనుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇవాళ్టి నుంచి అమల్లోకి తెచ్చింది ఆలయబోర్డు. ప్రత్యేక దర్శనానికి భక్తులను అనుమతించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఏ విధమైన క్యూలైన్లలో వేచి చూడకుండా ఐదేళ్లలోపున్న తమ పిల్లలతో  తల్లిదండ్రులు స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఈ ఉదయం తిరుమలలో రద్దీ అధికంగా కొనసాగుతోంది. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్టుమెంట్లు నిండివున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles