No end to commuters' woes as TSRTC strike enters day 3 తెలంగాణలో మూడవ రోజుకు చేరిన అర్టీసీ కార్మికుల సమ్మె

No end to commuters woes as tsrtc strike enters day 3

TSRTC Workers gnore Govt warning, CM KCR Strong Warning To RTC, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Strong Warning To CM KCR, CM KCR, Warning To CM KCR, tsrtc workers strike, IAS committee tsrtc, face to face with tsrtc workers, tsrtc to merge in government, ts government

Commuters, especially those planning to go to their native places for the festival season, faced untold hardships as the indefinite strike enters third day called by the employees of Telangana State Road Transport Corporation (TSRTC).

తెలంగాణలో మూడవ రోజుకు చేరిన అర్టీసీ కార్మికుల సమ్మె

Posted: 10/07/2019 12:48 PM IST
No end to commuters woes as tsrtc strike enters day 3

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గేది లేదని అర్టీసీ కార్మికులు భీష్మించడంతో తెలంగాణలో అర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా అర్టీసీ బస్సు సర్వీసులు స్తంభించిపోయాయి.. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ విషయంలో ఇప్పటికీ యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వారికి ఎలాంటి పిలుపు రాకపోవడంతో కార్మిక సంఘాలు కూడా పట్టుదలదో సమ్మెను ఉదృతం చేస్తున్నాయి.

కాగా, తీవ్ర నష్టాల బాటలో వున్న ఆర్టీసీని ఆదుకునేందుకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొనసాగించిన ప్రయత్నాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా కార్మిక సంఘాలు తమ డిమాండ్లను యాజమాన్యం ముందు పెట్టి సమ్మె అస్త్రాన్ని సంధిస్తుండటంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గానే వ్యవహరించాలని నిర్ణయించింది. శనివారం సాయంత్రం 6 గంటలను డెడ్ లైన్ గా విధించినా.. కార్మికులు దానిని లక్ష్యపెట్టక సమ్మెలో కూర్చోవడంతో కిం కర్తవ్యమేమిటన్న విషయమై అలోచనలో పడింది.

నష్టాలలో వున్న అర్టీసీకి కాసింత ఆదాయం చేకూర్చే దసరా, బతుకమ్మ పండుగలను కూడా కార్మిక సంఘాలు విస్మరించి.. వారి ప్రయోజనం కోసమే ఆలోచించడం ఏంటని.. ప్రభుత్వం మండిపడుతోంది. ఆదాయం విషయాన్ని పక్కన బెడితే ఈ పండుగ సందర్భంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరాలని కూడా భావిస్తారని, అలాంటి పండుగలను అడ్డుపెట్టుకుని కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపు నివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వం సీరియస్ గా వుందని సమాచారం.

అయితే.. అటు కార్మిక సంఘాల సమ్మెకు ఇటు ప్రభుత్వం చూపన ప్రత్యామ్నయ మార్గాలకు మధ్య పండగ వేళ ప్రయాణికులు అనేక ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. దసరా పండగ వేళ తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్దమైన వేలాది మంది ప్రయాణికులకు తమ గమ్యస్థానాలకు చేరే దారి కనింపిచడం లేదు. కొందరు ప్రైవేటు ట్రావెల్స్ ను అశ్రయించగా, మరికోందరు ప్రయాణాలను నిలిపివేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇంకోందరు ప్రత్యామ్నాయ రవాణాలను అశ్రయిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Srike  TS Employees  CM KCR  IAS committee  Ashwathama Reddy  RTC Unions  RTC workers  Telangana  

Other Articles