godess kanakadurgadevi in Sri Saraswati Devi avatar శ్రీ సరస్వతి దేవి అవతారంలో కనకదుర్గ అమ్మవారు..

Sri kanaka durga devi atop indrakeeladri in sri saraswati devi avatar

Dussehra, Sri Kanakadurga temple, Goddess Durga, Sri Saraswati Devi, Sri Lalitha Tripura Sundari Devi, Sri Annapurna Devi darshan, Indrakeeladri, stanacharyulu, temple chief priest, YS Jagan Mohan Reddy, devotees, Andhra pradesh

As part of nine-day long Navratri festival celebrations at Sri Kanakadurga temple atop Indrakeeladri hill today Goddess Durga will appear as Sri Saraswati Devi on the Sixth day of the nine-day festival. The devotees are being allowed to take darshan from 3 am onwards.

శ్రీ సరస్వతి దేవి అవతారంలో కనకదుర్గ అమ్మవారు..

Posted: 10/05/2019 09:39 AM IST
Sri kanaka durga devi atop indrakeeladri in sri saraswati devi avatar

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుకల్లో  శ్రీ కనకదుర్గ అమ్మవారు ఇవాళ శ్రీ సరస్వతీ దేవి దేవి అవతారం భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శరన్నవరాత్రి వేడుకలలో తొమ్మిది రోజులు తోమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చే దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. నవరాత్రి వేడుకలలో వివిధ అవతరాల్లోని కొలువయ్యే దుర్గమ్మ దర్శంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు నలుమూలల నుంచి ఇంద్రకీలాద్రికి చేరకుంటున్నారు.

ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అక్టోబర్ 5, శనివారం నాడు అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని ఇవాళ తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం నుంచి పిల్లలకు విద్యాబుద్దులు ఉన్నత చదువులు సక్రమంగా సాగాలని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. చేతిలో కచ్ఛపి అనే బంగారు వీణను ధరించి, నెమలి వాహనాన్ని అధిరోహించి ఉంటుంది. ఈమెను విజ్ఞానదేవతగా శాస్త్రాలు చెబుతున్నాయి.

సరస్వతీ దేవి బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. సంగీతం, నృత్యం వంటి కళలూ ఈ తల్లి అనుగ్రహం వల్లే లభిస్తాయి. వ్యాసుడు, యాజ్ఞవల్క్యుడు, వాల్మీకి తదితర మహర్షులందరూ ఈ తల్లిని పూజించి మహోన్నతమైన కావ్యాలు, పురాణాలు రచించారు. కళాకారులుగా ప్రముఖులుగా వెలుగోందుతున్న వారికి సరస్వతీ కటాక్షం వుందనే అంటారు. అక్షరజ్ఞానంతో పాటు అవసరమైన సంస్కార జ్ఞానాన్నీ అందిస్తుంది మాతృమూర్తిగా ఉన్న మహిళ. అందుకనే అన్ని విద్యలకు మహిళ అయిన సరస్వతిని అధిష్ఠాన దేవతగా మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

శ్రీ సరస్వతి దేవి అవతారంలోని అమ్మవారిని దర్శించుకోటానికి భక్తులు వేకువజాము నుండే ఇంద్రకీలాద్రికి బారులుతీరారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. ఐదవ రోజున లలితా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచ్చేశారు. అమ్మవారి ఆలయ అర్చకులు ఆయనను పూర్ణకుంభంతో ఆలయ లాంఛనాలతో ఘనంగా అహ్వానం పలికారు. ఇక ఇవాళ కూడా అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dussehra  Sri Kanakadurga temple  Goddess Durga  Sri Saraswati Devi  darshan  Indrakeeladri  devotees  

Other Articles