Telangana HC dismiss cbi probe on kodela death కోడెల మృతిపై సీబిఐ దర్యాప్తుకు హైకోర్టు నో..

Telangana hc dismiss cbi probe on kodela siva prasada rao death

kodela siva prasad rao, suicide case, cbi probe, Telangana High court, chandrababu, YS Jagan, Andhra Pradesh, Politics

Telangana High Court dismisses petition in probing the case with CBI in former andhra pradesh speaker Kodela Shia Prasad Rao, which was filed by the TDP activist Venkatesh.

కోడెల మృతిపై సీబిఐ దర్యాప్తుకు హైకోర్టు నో..

Posted: 09/24/2019 05:04 PM IST
Telangana hc dismiss cbi probe on kodela siva prasada rao death

ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణంపై అనుమానాలున్నాయని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కోడెల ఆత్మహత్య చేసుకోలేదని, ఆయన కొడుకే కోడెలను హత్య చేసి ఉంటాడని సందేహాలు కలుగుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. కోడెల మృతిపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని, కేసును సీబీఐకి అప్పగించాలని బూరగడ్డ అనిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కోడెలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పిటిషన్‌ను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా అనుమతించలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

దర్యాప్తు వేగవంతం..

మరోవైపు కోడెల కేసు దర్యాప్తును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే 18 మంది సాక్షులను పోలీసులు ప్రశ్నించారు. కోడెలపై విషప్రయోగం జరిగిందా అన్న కోణంలోనూ పోలీసులు దృష్టి సారించారు. కోడెల వినియోగించిన మందులు, సంఘటన స్థలంలో సేకరించిన వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. టెక్నికల్, ఫోరెన్సిక్ నిపుణులు కోడెల నివాసంలో సోదాలు నిర్వహించి పలు ఆధారాలను సేకరించారు. ఫోరెన్సిక్ నివేదికల అనంతరం పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు జరపనున్నట్లు తెలుస్తోంది.

కోడెల ఆత్మహత్య చేసుకోలేదని, కుమారుడే హత్య చేసి ఉంటాడని ఆరోపణలు వచ్చాయి. ఏపీలో కోడెల సమీప బంధువు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కోడెల కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మిలకు కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. విచారణ అధికారుల ముందు హాజరుకావాలని ఇప్పటికే వారిద్దరికీ పోలీసులు సమాచారం పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles