Devipatnam Boat Tragedy: Toll Rises To 33 గోదావరి నదిలో బోటు ఎక్కడుందో తెలిసింది.. కానీ..

Death toll in ap tourist boat mishap rises to 28

boat capsizes in Godavari river, sight seeing boat capsizes, CM Jagan, Twitter, boat capsizes near devipatnam, boat capsizes in East Godavari, boat capsizes in Andhra Pradesh, Godavari river, sight seeing boat, devipatnam, boat capsizes, East Godavari, Andhra Pradesh, Crime

Toll in the tourist boat accident in river Godavari in Andhra Pradesh mounted to 33 as five more bodies were retrieved on Wednesday, while 13 others were yet to be traced.

గోదావరి నదిలో బోటు ఎక్కడుందో తెలిసింది.. కానీ..

Posted: 09/18/2019 11:47 AM IST
Death toll in ap tourist boat mishap rises to 28

గోదావరిలో జరిగిన ఘోర దుర్ఘటనలో ఇప్పటికీ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఆదివారం రాత్రి  ఈ దుర్ఘటన జరుగుగా మూడు రోజులు కావస్తున్నా ఇంకా గల్లంతైన వారి కోసం అన్వేషణ కొనసాగుతూనే వుంది. 12 మంది మృతదేహాలను  ఘటన జరిగినే రోజునే వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది. ఈ ఘటనలో మొత్తంగా 39 మంది వరకు గల్లంతు కాగా, నిన్నటివరకు 31 మృతదేహాలను వెలికితీశారు. కాగా మరో 13 మంది మృతదేహాలను కనుగొనాల్సి వుంది.

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు ముందుగా బోల్తా పడి, ఆతరువాత మునక వేయడంతో మృతుల సంఖ్య అధికంగా వుందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాగా ఈ ప్రమాద ఘటన గల్లంతైన వారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వున్నారు.  తాజాగా దేవీపట్నం వద్ద ఇవాళ మరో 5 మృతదేహాలను గుర్తించారు. సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది వాటిలో మూడు మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. వాటిని రాజమండ్రి తరలించారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 31కి చేరింది.  

ఇదిలావుండగా, బోటు జాడతో పాటు గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీసే పనిలోభాగంగా రంగంలోకి దిగిన భారత నేవి సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కాగా, ఈ ప్రమాదంలో మునిగిపోయిన బోటు గోదావరి నదిలో దాదాపు 315 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. కానీ ఆ బోటును వెలికి తీయడం తమ వల్ల కాదని భారత నేవీ వర్గాలంటున్నాయి. ఇలాంటి ఆపరేషన్లలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన నేవీ అధికారి దశరథ్ సైతం ఇది అసాధ్యం అంటూ తేల్చేయడంతో ఇక ఆ బోటు పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

గోదావరిలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తమకు 150 అడుగుల లోతు వరకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉందని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో బలిమెల రిజర్వాయర్ లో భద్రతాబలగాల బోటు మునిగిపోగా, దాన్ని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బయటికి తీసుకువచ్చారు. అయితే ఆ బోటు 70 అడుగుల లోతులోనే ఉండడంతో అది సాధ్యమైంది. కానీ, గోదావరి పరిస్థితుల్లో మరింత లోతుకు వెళ్లడం ఏమంత క్షేమకరం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari river  devipatnam  boat capsizes  CM Jagan  Twitter  East Godavari  Andhra Pradesh  Crime  

Other Articles