Abdul Basit trolled for Mistaking porn star for Kashmiri Man నెట్ జనులు పాకిస్తాన్ మళ్లీ ఆడేసుకుంటున్నారు.. ఎందుకంటే..

Former pakistan envoy to india mistakes adult film actor for kashmiri man gets trolled

Abdul Basit, Abdul Basit faux pas, Abdul Basit trolled, adult actor Johnny Sins, Anantnag, faux pas, former High Commissioner of Pakistan to India, goof up, johnny sins, Johnny Sins pornstar, Kashmir, kashmir pellet guns, Line of Control, pellet Guns, twitter gaffe, twitter reactions, twitter trolling, yousuf

Abdul Basit, the former High Commissioner of Pakistan to India, on Monday, made an embarrassing goof-up in an attempt to convince the public that the Kashmiris on the other side of the Line of Control were being shot down by pellet guns.

నెట్ జనులు పాకిస్తాన్ మళ్లీ ఆడేసుకుంటున్నారు.. ఎందుకంటే..

Posted: 09/03/2019 02:11 PM IST
Former pakistan envoy to india mistakes adult film actor for kashmiri man gets trolled

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మా పోరుగు దేశాలంటూ ఐక్యరాజ్యసమితిలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ ఇంకా ప్రపంచంతో పాటు తన స్వదేశంలోనూ విమర్శలు వినిసిస్తూనే వున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ లో పాక్ మాజీ హై కమిషనర్ గా వ్యవహరించిన అబ్దుల్ బాసిత్ ను నెట్ జనులు టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఆయనను విపరీతంగా ట్రాలింగ్ చేస్తున్నారు నెటి జనులు. ఎందుకంటారా.? అత్యంత కీలకమైన విషయంలో తన తప్పుడు పోస్టులతో యావత్ ప్రపంచ నెటిజనులు దృష్టిని తనవైపు తిప్పుకోగలిగారు. కశ్మీర్ విషయంలో భారత్‌ను ఎండగట్టబోయి బొక్కబోర్లా పడ్డారు.

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఎన్నిసార్లు పరాభవాలు ఎదురైనా.. పాకిస్తాన్ తన వక్రబుద్దిని మాత్రం మార్చుకోవడం లేదు. తప్పుడు ఫోటోలను ఫోస్ట్ చేసి.. వాటితో లబ్ది పోందాలని తొక వంకర బుద్దితో ఇంకా ప్రయత్నాలు చేస్తూనే వుంది. తాజాగా అబ్దుల్ బాసిత్ కూడా అలాంటి కార్యానికే తలపడ్డాడు. కాశ్మీర్ బాధితుడు అంటూ ఓ పోర్న్ స్టార్ ఫోటోను పోస్టు చేసి ఆయన తప్పులో కాలేశారు. కశ్మీర్‌లో జరిగిన రాళ్ల దాడిలో ఓ యువకుడు కన్ను కోల్పోయాడంటూ ఓ ఫొటోను రీట్వీట్ చేశారు. అయితే, అందులో ఉన్నది కశ్మీరీ యువకుడు కాదు.. అడల్ట్ పోర్న్ స్టార్ జానీ సిన్స్ కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.

పాకిస్థాన్‌కే చెందిన జర్నలిస్టు నైలా ఇనాయత్.. బాసిత్ ట్వీట్ స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.  మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కశ్మీరీ యువకుడికి బదులు అడల్ట్ పోర్న్ స్టార్ జానీ సిన్స్ ఫొటోను ట్వీట్ చేశారని నైలా పేర్కొన్నారు. అబ్దుల్ బాసిత్ ఫొటోను రీట్వీట్ చేస్తూ.. రాళ్లదాడిలో కంటి చూపు కోల్పోయాడని, భారత్‌కు వ్యతిరేకంగా గళం విప్పాలని అందులో కోరారు. అయితే, యూసుఫ్‌కు బదులు పోర్న్ స్టార్‌ ఫొటోను ట్వీట్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, బాసిత్ ఆ తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles