Row erupts as Trump offers to mediate in Kashmir issue కాశ్మీర్ వివాదం నోరుజారిన ట్రంప్.. ఆనక దిద్దుబాటు చర్యలు..

India denies pm modi asked trump to mediate in kashmir conflict

Donald Trump, Kashmir, America, United States, Ambassador To US, Harsh Vardhan, Eliot L Engel, Brad Sherman, Narendra Modi, Imran Khan, India, Pakistan, kashmir issue, Kashmir controversy, Politics

India has denied that PM Narendra Modi asked US President Donald Trump to mediate in the longstanding Kashmir conflict with Pakistan.

కాశ్మీర్ వివాదం నోరుజారిన ట్రంప్.. ఆనక దిద్దుబాటు చర్యలు..

Posted: 07/23/2019 01:23 PM IST
India denies pm modi asked trump to mediate in kashmir conflict

అమెరికా ప్రపంచ దేశాలకు పెద్దన్నపాత్రను ఫోషించడంలో తప్పులేదు కానీ.. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం ఇన్నాళ్లు వేరు.. ఇప్పుడు వేరు అన్న విషయాన్ని మర్చిపోరాదు. భారత్ తో సన్నిహిత సంబంధాలను మరింత మెరుగుపర్చుకుంటామని అంటూనే.. మరోవైపు భారత ధాయాధి దేశమైన పాకిస్తాన్ కు సానుకూలంగా నిర్ణయం తీసుకునేలా ఇటీవల అదేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇటు భారత్ సహా అటు ఆయన సొంతదేశంలోనే అగ్గిని రాజేస్తున్నాయి.

కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రచ్చరచ్చ అయ్యాయి. దీంతో ఇక చేసేదిలేక దిద్దుబాటు చర్యలకు దిగింది ట్రంప్ ప్రభుత్వం. భారత్ సహా పలు దేశాల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో పెద్దన్న భారత్ కు క్షమాపణలు చెప్పకతప్పలేదు. అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ కు ఆ దేశ సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు, అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ ఎలియట్ ఎల్ ఎంగెల్ వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియా-పాకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపుతాయని తెలిపారు. మరో యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ కూడా హర్షవర్ధన్ కు క్షమాపణలు చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు అసమగ్రంగా, ఇబ్బందికరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై హర్షవర్ధన్ కు క్షమాపణ చెప్పానని తెలిపారు. భారత్ పాకిస్తాన్ దేశాలే సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోగలవని అయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కశ్మీర్ వివాదంలో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని ఇండియా అంగీకరించదనే విషయం దక్షిణాసియా విదేశాంగ విధానాలపై అవగాహన ఉన్న అందరికీ తెలుసని అన్నారు. భారత ప్రధాని మోదీ ఇలాంటి వాటిని అంగీకరించరని చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేసేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. ఇక అంతకుముందు టెర్రరిజంపై పాకిస్థాన్ కఠినమైన చర్యలు తీసుకుంటేనే... భారత్ తో చర్చలు సాధ్యపడతాయని వెల్లడించింది. భారత్-పాక్ లు కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చేసే యత్నాలకు ట్రంప్ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపింది.

అమెరికా విదేశాంగ శాఖకు చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంటేనే... భారత్ తో ద్వైపాక్షిక చర్చలు విజయవంతమవుతాయని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ చిత్తశుద్ధిపైనే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో తమ సహకారం ఉంటుందని తెలిపారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి తాము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Kashmir  United States  Narendra Modi  Imran Khan  India  Pakistan  Politics  

Other Articles