Karnataka Crisis All Eyes Speaker నేడు స్పీకర్‌ నిర్ణయం.. ఉత్కంఠ!

Karnataka crisis all eyes speaker

Karnataka, Kumaraswamy, BJP, JDS, Congress Party, Ramesh Kumar

Karnataka Crisis All Eyes Speaker

నేడు స్పీకర్‌ నిర్ణయం.. ఉత్కంఠ!

Posted: 07/09/2019 12:38 PM IST
Karnataka crisis all eyes speaker

కర్ణాటకలోని రాజకీయ సంక్షోభంపై నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేల రాజీనామా అంశాన్ని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ మంగళవారం పరిశీలించనున్నారు. ఆయన నేడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. స్పీకర్‌ ఒకవేళ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే.. సంకీర్ణ ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. ఇక, స్పీకర్‌ రాజీనామాలు ఆమోదించకుండా.. దాటవేత ధోరణి అవలంబిస్తే.. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి కొంత సమయం దొరికినట్టు అవుతోంది. అలా కాకుండా రాజీనామాలు ఆమోదించినా.. లేదా అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించినా సంకీర్ణకూటమికి గడ్డుకాలమే. అయితే, వ్యక్తిగతంగా తనను కలువాల్సిందిగా స్పీకర్‌ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ఆదేశించి అవకాశముందని వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Ramesh Kumar  

Other Articles