YS JaganMohan Reddy not gives appointment to TDP MLAs టీడీపీ నేతల బృందానికి అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం జగన్

Ys jaganmohan reddy not gives appointment to tdp mlas

TDP MLAs, YS Jagan TDP MLAs appointment, YS JaganMohan Reddy sworn in as CM of AP, YS JaganMohan Reddy Andhra Pradesh CM, YS Jagan denies appointment to TDP MLA, Governor ESL Narasimhan, Andhra Pradesh Chief Minister, YS JaganMohan Reddy, Chief Minister, YSRCP, Assembly elections, lok-sabha-elections-2019, andhra pradesh, politics

YS JaganMohan Reddy takes oath as Chief Minister of Andhra Pradesh, but news is that he denies the appointment which was asked by the opposition party TDP MLAs who want to congratulate him on behalf of TDP party president Chandrababu.

టీడీపీ నేతల బృందానికి అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం జగన్

Posted: 05/30/2019 01:18 PM IST
Ys jaganmohan reddy not gives appointment to tdp mlas

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కారాదని నిర్ణయించుకున్న మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ తరఫున శుభాకాంక్షలను తెలియజేసేందుకు ఆయన టీడీపీ సీనియర్ నేతల బృందాన్ని పంపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో బిజీబిజీగా వున్న వైఎస్ జగన్.. సమాయాభావం వల్ల వారికి అనుమతిని ఇవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనలతో వీరు ముగ్గురూ జగన్ అపాయింట్ మెంట్ కోరగా, అది లభించలేదు.

టీడీపీ ఎమ్మెల్యేల బృందాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే విజయవాడలోని ఇందిరాప్రియదర్శిని మునిసిపల్ స్టేడియానికి కాకుండా, తాడెపల్లిలోని వైఎస్ జగన్ ఇంటికి వెళ్లి అభినందించి రావాలని చంద్రబాబు సూచించారు. దీంతో వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ కోరిన టీడీపీ ఎమ్మెల్యేలకు అనుమతి లభించలేదు. ఈ ఉదయం నుంచి జగన్ చాలా బిజీగా ఉన్నారని, సమయాభావం వల్ల ఎవరినీ కలవలేదని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు సైతం నేరుగా స్టేడియం వద్దకే వెళ్లారని జగన్ కార్యాలయ వర్గాలు వారికి స్పష్టం చేసినట్టు తెలిసింది. వీరు కూడా స్టేడియం వద్దకు వెళ్లి జగన్ ను కలవవచ్చని వారు స్పష్టం చేసినట్టు సమాచారం.

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న క్రమంలో మాజీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేస్తూ లేఖ రాశారు. పేదల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని లేఖలో జగన్ కు సూచించారు. కొత్త ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. టీడీపీ తరపున జగన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles