EC orders repolling in five more booths in Andhra ఆంధ్రప్రదేశ్ లో రీ-పోలింగ్.. ఎప్పుడు.. ఎక్కడెక్కడంటే..

Repoll in 5 polling stations in ap s chandragiri constituency

Government of Andhra Pradesh, Andhra Pradesh, State governments of India, Chittoor, Andhra Pradesh, Chandragiri, Chittoor (SC), Indian general election in Andhra Pradesh, Chandragiri mandal, State Chief Electoral Officer, Chittoor, Telugu Desam Party, Election, Andhra Pradesh, politics

The Election Commission of India Wednesday ordered a repoll on May 19 in five polling stations in Chandragiri Assembly segment under Chittoor Lok Sabha constituency in Andhra Pradesh, State Chief Electoral Officer Gopal Krishna Dwivedi said.

ఆంధ్రప్రదేశ్ లో రీ-పోలింగ్.. ఎప్పుడు.. ఎక్కడెక్కడంటే..

Posted: 05/15/2019 07:04 PM IST
Repoll in 5 polling stations in ap s chandragiri constituency

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సరళిపై సుదీర్ఘంగా పరిశీలన జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ఓ పర్యాయం పలు బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడి ఓటర్ల తీర్పు ఈవీఎం యంత్రాలలో నిక్షిప్తం కావడంతో వాటిని పధిలంగా భద్రపర్చిన ఈసీ.. తాజాగా మరోమారు పలు బూత్ లలో రీ-పోలింగ్ కు నగరా మ్రోగించింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు.

ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిహెచ్ భాస్కర్ రెడ్డి.. ఓ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకున్నారని, దీంతో వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు ఎన్నికల అధికారులకు పలువురి నుంచి మరిన్నీ పిర్యాదులు కూడా అందాయి. దీంతో వీటిపై విచారణ జరిపి నివేదిక అందజేయాల్సిందిగా చిత్తూరు జిల్లా కలక్టర్ ను అదేశించారు ద్వివేది. కలక్టర్ అందజేసిన నివేదిక ప్రకారం చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ ల పరిధిలో రీ-పోలింగ్ జరపనున్నామని సీఈవో ప్రకటించారు.

రాష్ట్రంలో రీపోలింగ్ జరపాల్సిన కేంద్రాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 19న రీపోలింగ్ ఉంటుందని ఈసీఐ పేర్కొంది. ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం గ్రామాల్లో రీపోలింగ్ జరుపుతామని ఈసీ వర్గాలు తెలిపాయి.

చంద్రగిరిలోని ఐదు పోలింగ్ బూత్ లలో రీ-పోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయంచడంతో ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు సీఈవో సుజాత శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కేవలం వైసీపీ నేతలు పిర్యాదులపైనే ఎన్నికల సంఘం స్పందించిందని.. తమ పిర్యాదులను పరిగణలోకే తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం, మీడియాతో కళా వెంకట్రావు మాట్లాడుతూ, పోలింగ్ రోజున చంద్రగిరి నియోజకవర్గంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై తమ అభ్యర్థి ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. పోలింగ్ జరిగిన ఇరవై నాలుగు రోజుల తర్వాత వైసీపీ అభ్యర్థి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఫిర్యాదు చేస్తే ఈసీ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Re-Polling  Chandragiri mandal  K Kala Venkata Rao  Andhra Pradesh  politics  

Other Articles