ys jagan heartful gift to small boy తనను నవ్వించిన బుడతడికి వైఎస్ జగన్ గిఫ్ట్ ఏంటో..?

Ys jagan gives a heartful gift to small boy who makes him laugh

YSRCP president YS Jagan, YS Jagan heartful gift to small boy, small boy makes YS Jagan laugh, small boy imitates YS Jagan in front of him, YS Jagan gift to small boy who makes him laugh, YS Jagan, imitation, mimicry, small boy, TDP, Chandrababu, mannerism, andhra pradesh, politics

YSRCP president YS Jagan gives a heartful gift to small boy who makes him laugh with Funny Imitation With His Manerism Infront On Him.

ITEMVIDEOS: నవ్వించిన బుడతడికి వైఎస్ జగన్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..

Posted: 05/11/2019 01:42 PM IST
Ys jagan gives a heartful gift to small boy who makes him laugh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన క్రమంలో అన్ని పార్టీల నేతలు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తూ.. పోలింగ్ సరళి ఎలా జరిగింది.. ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలుస్తామన్న అంచానల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు పాదయాత్రలు, ప్రచారాలతో పూర్తిగా విశ్రాంతి లేకుండా శ్రమించిన నేతలు విదేశాలకు వెళ్లి సేదతీరి వచ్చారు. ఇక దేశ సార్వత్రిక ఎన్నికలలో చివరి రెండు విడతలు మాత్రమే మిగిలివుండటం. అందులో రేపు (ఆదివారం 12న) ఆరో విడత ఎన్నికలు జరగనున్న క్రమంలో పలువురు నాయకులు అక్కడ చక్రం తిప్పే పనిలో వుండగా, కొందరు మాత్రం వాటి జోలికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

ఈ క్రమంలో విదేశాలలో సేదతీరి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తన పార్టీ కార్యాలయంలో వుండగా, పలువరు పార్టీ కార్యకర్తలు, నేతలు వచ్చి ఆయనను కలిసారు. రాష్ట్రంతో పాటు హస్తినలోనూ దీక్షలు, పాదయాత్రలు, ప్రచారసభలు అన్నింటినీ నిర్వహించిన జగన్.. ప్రచారం ఎలా వుంటుంది, ఆయన మ్యానరిజం ఎలా సాగుతుంది.? ఆయన ఎలాంటి యాస వాడుతారు.? అన్న విషయాలను ప్రస్తావిస్తారు.. అన్న అంశాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే.

ఇక చిన్నపిల్లల విషయం మాత్రం చెప్పడం కష్టం.. ఒక్కసారి చూసిన విషయాలను వారు ఆ తరువాత టీవీలో వస్తే.. దానిని అన్వయించడం వారికి చాలా ఇష్టం. అయితే ఇలాంటి కేవలం ప్రకటనలకో లేక కార్టూస్ షోలకో, సినిమాలకో పరిమితం కావడం కామన్. కానీ ఏకంగా ఒక రాజకీయ నేతను అలా ఫాలో కావడం కొంచెం కష్టం. కానీ పశ్చిమ గోదావరిలోని ఓ బుడతడు వైఎస జగన్ ను అచ్చంగా ఆయన మ్యానరిజంలోనే ఇమిటేట్ చేశాడు.

పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో జగన్ ఎలా మాట్లాడతారో అచ్చం అలాగే తన యాసను జోడించి ప్రసంగించాడీ ఈ బుడతడు. దీంతో జగన్ తో పాటు అక్కడున్న వైసీపీ నేతలు, భద్రతా సిబ్బంది గట్టిగా నవ్వేశారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి బుడతడికి మనస్పూర్తిగా నదుటిపై ముద్దిచ్చి ఆశీర్వదించారు జగన్. జగన్ నుంచి తాను చక్కటి ముద్దును గిప్ట్ గా పోందానని బుడతడు చెప్పడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని మీరూ చూసేయండి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  imitation  mimicry  small boy  TDP  Chandrababu  mannerism  andhra pradesh  politics  

Other Articles