Rajiv Gandhi died due to their hatred: Ahmed Patel hits out at BJP ‘రాజీవ్ గాంధీ హత్యకు మీ విద్వేషాలే కారణం కాదా..!‘

Ahmed patel blames bjp for rajiv gandhi s death says he died because of your hatred

Narendra Modi, rajiv gandhi, congress, Ahmed Patel, social media, Twitter, bjp, congress bjp fight, rajiv gandhi, former pm rajiv gandhi, ins viraat, ins virat, controversy, narendra modi, rahul gandhi, politics

In a social media post on Twitter, Ahmed Patel slammed the BJP and PM Modi for attacking former prime minister Rajiv Gandhi. Patel even indicated that the BJP's hatred led to Rajiv Gandhi's assassination.

‘రాజీవ్ గాంధీ హత్యకు మీ విద్వేషాలే కారణం కాదా..!‘

Posted: 05/09/2019 01:22 PM IST
Ahmed patel blames bjp for rajiv gandhi s death says he died because of your hatred

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఐదు విడదల పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది రెండు విడతలే. అయితే ఈ విడతలే అత్యంత కీలకంగా మారాయి. మరోమారు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. తన ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పై విమర్శలను గుప్పిస్తోంది. గుజరాత్ మోడల్ అభివృద్ది నినాదం, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం, నిత్యావసర సరుకుల నియంత్రణ ఇలాంటి హామీలతో  ఛాయ్ వాలా నినాదంతో అధికారంలోకి వచ్చింది మోడీ ప్రభుత్వం.

అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా హామీలను మార్చేసింది. నల్లధనం గంగలో కలిపేసింది.. అవినీతిని మతిపరుకు అప్పజెప్పింది.. నిత్యావసర సరుకుల ధరలకు బదులు వ్యక్తిగత దూషణలకు, గుజారాత్ మోడల్ అభివృద్దిని సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో మర్చేసింది. ఏకంగా రాజీవ్ గాంధీని టార్గటె్ చేసి ప్రధాని మోడీ ఆయన నెంబర్ వన్ అవినీతిపరుడు అని అంటూనే.. తనపై మాత్రం దేశప్రజల్లో సానుభూతి వెరిసేమాదిరిగా తనపై నీచమైన అరోపణలు చేశారని, తన తండ్రి ఎవరని కూడా అడిగారని, తనను ఛాయ్ వాలా అని చులకన చేశారని.. ఇప్పుడు తాను అవినీతి సోమ్మును అర్జించకుండా చౌకీధార్ గా మారారని ప్రసంగాలు చేస్తున్నారు.

దీంతో కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి ద్వేషమే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానికి కారణమైందన్నారు. నంబర్ వన్ అవినీతిపరుడు అంటూ రాజీవ్ గాంధీ‌ని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ విమర్శించిన విషయం తెలిసిందే. దీనికి పటేల్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ఆయనేమన్నారంటే.. ‘‘అమరుడైన ఓ ప్రధానిని విమర్శించడం అంటే పిరికితనానికి ప్రతీక. కానీ ఆయన హత్యకు కారకులు ఎవరు? రాజీవ్‌కు అదనపు భద్రత కల్పిండానికి బీజేపీ మద్దతుతో ఏర్పడిని వీపీ సింగ్ సర్కార్ నిరాకరించింది.

ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. ఒక వ్యక్తిగత భద్రతా అధికారిని ఇచ్చి.. చేతులు దులిపేసుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలను బేఖాతరు చేశారు. వారి విద్వేషానికి రాజీవ్ బలయ్యారు. బీజేపీ చేస్తున్న నిరాధార ఆరోపణలకు, తిట్లకు సమాధానం ఇచ్చుకోవడానికి ఆయనిప్పుడు లేరు’’ అని ట్వీట్ చేశారు. తాను ప్రధానినని మర్చిపోయిన నరేంద్రమోడీ.. సానుభూతి కోసం ఎన్ని రకలా వేశాలు వేస్తూ.. కాంగ్రెస్ ద్వీతీయ శ్రేణి నాయకులు చేసిన వ్యాక్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. దీంతోపాటు బీజేపి నేతల గత ఐదేళ్లుగా చేస్తున్న వ్యాఖ్యలతో పాటు దేశాన్ని బీజేపి ఎటువైపు నడిపించిందోనన్న విషయాన్ని కూడా ప్రధాని మోడీ ప్రసంగాల ద్వారా వివరించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  rajiv gandhi  Ahmed Patel  congress  social media  Twitter  bjp  politics  

Other Articles