సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలంటూ రిపోర్టర్ లకు లంచం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని జమ్మూకశ్మీర్ లోని లేహ్ కు చెందిన జర్నలిస్ట్ ల బృందం ఆరోపించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోలో జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, ఆ పార్టీ శాసనసభ్యుడు విక్రమ్ రంద్వాలు జర్నలిస్ట్ లకు డబ్బులను ఎన్వలప్ కవర్లలో పెట్టి ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీనిపై లేహ్ ప్రెస్ క్లబ్ సభ్యులు స్థానిక ఎన్నికల అధికారికి లేఖ రాశారు.
హోటల్ సింగీ ప్యాలెస్ లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో జర్నలిస్ట్ లకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆ లేఖలో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. లేహ్ ప్రాంతంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామణ్ ర్యాలీ కవర్ చేసేందుకు జర్నలిస్ట్ లకు ఇన్విటేషన్ లెటర్స్ ఇచ్చినట్లు బీజేపీ తెలిపింది. ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ లపై పరువునష్టం దావా వేస్తామని బీజేపీ హెచ్చరించింది. అయితే ఇది కేవలం బీజేపి దబాయింపే తప్ప.. వారిచ్చింది మాత్రం లంచమేనంటున్నారు జర్నలిస్టులు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి, బీజేపి సీనియర్ నేత నిర్మలా సీతారామన్ వస్తున్నారని అహ్వానాలను.. మీటింగ్ ముగిసిన తరువాత కొందరు రిపోర్టర్లు లేచి నిలబడి నాయకులతో ముచ్చట్లు పెట్టినప్పుడు ఇస్తారా.? లేక అందరూ కూర్చుని వుండగా ఇస్తారా.? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక ఈ ఆహ్వానాలను సీనియర్ బీజేపి నేత సమావేశానికి హాజరైన జర్నలిస్టులందరికీ అందించాలి వున్నా.. కేవలం నలుగురు జర్నలిస్టులకు అందించడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
ఇక బీజేపి కవర్లు అందుకున్న జర్నలిస్ట్ లలో ఒకరైన రిన్ చన్ అన్ గ్మో మాట్లాడుతూ.. సింగీ ప్యాలెస్ లో మీడియా సమావేశ సమయంలో బీజేపీ సీనియర్ లీడర్ నలుగురు జర్నలిస్ట్ లకు ఎన్వలప్ కవర్లు ఇచ్చారు.ఎన్వలప్ కవర్లను ఇక్కడ ఓపెన్ చేయవద్దు అని ఆయన సూచించారు. ఎన్వలప్ అందుకున్న వారిలో నేను కూడా ఉన్నాను.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సమక్షంలో ఇదంతా జరిగింది.నాకు అనుమానం వచ్చి ఓపెన్ చేశాను. కొన్ని రూ.500నోట్లు అందులో ఉన్నాయి. దీంతో తిరిగి ఆయనకే ఆ ఎన్వలప్ ఇచ్చాను. అయితే ఆయన అది తీసుకునేందుకు నిరాకరించారు. ఆ ఎన్వలప్ ను అక్కడే టేబుల్ పై ఉంచినట్లు ఆమె తెలిపారు.
జర్నలిస్టుల పిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించింది. కంప్లెయింట్ ను లోకల్ కోర్ట్ కి పంపించినట్లు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా బీజేపి పై మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపి అవినీతి కార్యకాలాపాలకు పాల్పడి కూడా అడ్డగోలుగా తాము సచ్చీలురమని వాదిస్తూ.. తమ నిజాయితీని నిరూపించుకున్న జర్నలిస్టులపైనే పరువు నష్టం దావా వేస్తామని బెదిరించడంలోనే బీజేపి పార్టీ వ్యవహారశైలి.. ఆ పార్టీ తీరు అర్థమవుతుందని విమర్శించారు.
ఇదే చర్యలకు దేశంలోని విపక్షాలలో ఏ పార్టీ అయినా పాల్పడివుంటే.. దేశప్రజలందరికీ తెలిసేలా బీజేపియే పెద్ద ప్రచారం చేసేదని.. దానికి భజానా కొట్టే మీడియా సంస్థలు కూడా తోడయ్యేవని అమె విమర్శించారు. జర్నలిస్టులకు లంచాన్ని కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ లేదా దేశంలోని ఏ బీజేపి కూటమేతర రాజకీయ పార్టీ ఇచ్చినా.. మీడియా.. అదే వీడియోను పదే పదే చూపుతూ.. రోజంతా దానిపైనే చర్చలు పెట్టేవారని మరి ఇప్పడు అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు రేడియో ఎందుకు మౌనం దాల్చిందని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు ఎందుకు కనిపించడం లేదని, అసలు ట్రోలింగే ఎందుకు లేదని ముఫ్తీ నిలదీశారు.
(And get your daily news straight to your inbox)
Dec 09 | ముంబైలో బార్ గాళ్స్ ను చెప్పులు లేకుండా పోలిస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై ముంబై పోలీస్ ఉన్నతాధికారులు శాఖపరమైన విచారణను అదేశించారు. ముంబై లాంటి ప్రాంతాల్లో బార్లలో బార్ గాళ్స్ ను... Read more
Dec 09 | అది 2012, డిసెంబర్ 16వ తేదీన.. తనను కట్టుకోబోయేవాడితో పాటు ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కిన పారామెడికల్ వైద్య విద్యార్థినికి ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ఇందుకు కారణమైన ఆరుగురిలో నలుగురికి అదే... Read more
Dec 09 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే అధికార, విపక్షాల మధ్య వేడిని రాజేస్తున్నాయి. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ... Read more
Dec 09 | ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఔత్సాహికులకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే తరుణం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీని వచ్చే నెలలో... Read more
Dec 09 | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది పెద్దల నానుడి. అలాంటి ఉల్లి ఏకంగా మనుషుల ప్రాణాలను కూడా తీస్తోందని మాత్రం ఎవ్వరూ ఊహించివుండరు. కానీ అదే జరుగుతోంది. ఉల్లి ధరకు రెక్కలు వచ్చి..... Read more