Indian Army finds snowman in Himalayas? హిమాలయాల్లో ‘యతిపురుషుడు’ జాడలు.. గుర్తించిన ఆర్మీ..

Indian army team spots footprints of mythical beast yeti on himalayas

yeti, yeti footprints, what is yeti, yeti history, yeti news, indian army, army yeti, yeti prints, Indian Army, SNOWMAN, Twitter, himalayas, Yeti, Memes, yeti foot prints

A new chapter was written in the legend of the Yeti after the Indian Army claimed it had discovered fresh “mysterious footprints” of the mythical creature.

హిమాలయాల్లో ‘మంచుమనిషి’ జాడలు.. గుర్తించిన ఆర్మీ..

Posted: 04/30/2019 06:15 PM IST
Indian army team spots footprints of mythical beast yeti on himalayas

యతి పురుషుడు.. భారీ శరీరంతో భయంకర రూపంతో మంచుకొండలపైనే సంచరించే మంచుమనిషి. అయితే హిందువుల పురణాల్లో మాత్రమే కన్పించే ఈ మంచు మనిషి రూపాన్ని పౌరాణిక చిత్రాల్లోనూ మన సృజనాత్మకత కలిగిన దర్శకులు చూపించారు. అయితే ఇది ఓ కల్పిత పాత్రగా మారినపోయిన తరుణంలో ఇది కల్పితం కాదు.. మంచు కొండల్లో సంచరించే యతి పురుషుడు వున్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తుంటాయి. కానీ ఈ సారి మాత్రం అలాకాకుండా మంచుమనిషి వున్నాడనటానికి సాక్షాల కూడా వున్నాయని అంటున్నారు భారత ఆర్మీ.

నిజమా అంటే.. తాజాగా యతి అస్థిత్వంపై ఆసక్తికర ట్వీట్‌ చేసింది ఆర్మీ. హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలను భారత సైన్యం గుర్తించింది. హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్‌ 9న మకలు బేస్‌ క్యాంప్‌ సమీపంలో ఓ వింత మనిషి అడుగులను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు కచ్చితంగా ‘యతి’వే అయి ఉంటాయని ఆర్మీ ట్విటర్‌లో పేర్కొంది. గతంలోనూ మకలు-బరున్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో యతి అడుగులు కన్పించినట్లు సైన్యం తెలిపింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆర్మీ ట్విటర్‌లో పోస్టు చేసింది. అయితే ఈ ఫొటోల్లో కేవలం ఒక కాలి ముద్రలు మాత్రమే ఉండటం గమనార్హం. యతి పురుషుడు.. అనేది ఇప్పటివరకు పురాణాల్లో, జానపద కథల్లో వినిపించే ఓ కల్పిత పాత్ర మాత్రమే. అయితే హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ మంచు మనిషి సంచారం ఉన్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. మంచుపై కన్పించిన పాద ముద్రల ఆధారంగానే అప్పుడు కూడా కథనాలు రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Army  SNOWMAN  Twitter  himalayas  Yeti  Memes  yeti foot prints  

Other Articles