SC declines to lift stay on release of PM Modi biopic ఫీఎం మోదీ చిత్ర నిర్మాతలకు సుప్రింకోర్టులో షాక్..!

Supreme court declines to lift stay on release of pm modi biopic

modi biopic, supreme court, sc modi biopic, narendra modi biopic, modi biopic, PM Modi, modi biopic, supreme court, election commission, producers, general elecions, vivek oberoi, politics

Saying it “won’t interfere" with an Election Commission (EC) order banning a biopic on Prime Minister Narendra Modi until 19 May, the Supreme Court on Friday refused to lift the stay on the release of the movie starring Vivek Oberoi.

ఫీఎం మోదీ చిత్ర నిర్మాతలకు సుప్రింకోర్టులో షాక్..!

Posted: 04/26/2019 01:27 PM IST
Supreme court declines to lift stay on release of pm modi biopic

ప్రధాని మోదీ బయోపిక్‌ నిర్మిణ యూనిట్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టు అదేశాల నేపథ్యంలో ఈ చిత్రం విడుదలకు మార్గం సుగమం అవుతుందని భావించిన నిర్మాణవర్గానికి అత్యున్నత న్యాయస్థానం గట్టి షాకిచ్చింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు ఈ చిత్రాన్ విడుదల చేయవద్దని తేల్చిచెప్పింది. అంతేకాదు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, టీజర్లను కూడా విడుదల చేయడానికి వీలు లేదని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా అదేశాలు ఇచ్చింది.

కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గొగోయ్‌ ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. వివరాల్లోకి వెళితే... దేశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రంతో మైలేజీని రాబట్టుకుందామని చిత్ర యూనిట్ యత్నించింది. అందులో భాగంగా ఈ చిత్రాన్ని ఏప్రీల్ 11న విడుదల చేయాలని భావించింది. కాగా ఈ చిత్రాన్ని ఎన్నికల సమయంలో విడుదల చేసేందుకు చకచకా ఏర్పాట్లు పూర్తైన క్రమంలో ఈ చిత్రంపై విపక్షాలు కోర్టుకు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 10న చిత్ర విడుదలను కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది.

దీంతో సెన్సార్ బోర్డు అనుమతి పొందిన నేపథ్యంలో తమ చిత్రాన్ని నిలిపివేయడం బావ్యం కాదంటూ చిత్రనిర్మాణ వర్గాలు న్యాయస్థానాన్ని అశ్రయించాయి. కేవలం ట్రైలర్ చూసిన ఎన్నికల సంఘం తమ చిత్రాన్ని ఏలా అడ్డుకుంటుందని వారు ప్రశ్నించారు. దీంతో చిత్రాన్ని చూసిన తరువాత తమ నిర్ణయాన్ని సీల్డు కవర్ లో వెళ్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని అదేశించింది. ఈ క్రమంలో ఈనెల 22న ఎన్నికల సంఘం తన నివేదిక అందించింది. సినిమా ఓ పార్టీకి ప్రయోజనం కల్పించేలా ఉందని, ప్రతిపక్షాలను అత్యంత దయనీయ పరిస్థితులల్లోకి నెట్టివేస్తూ చూపారని, ఇక చిత్ర ముగింపు అంతా ఒక వ్యక్తిని మహానుభావుడిగా చూపుతూ రూపోందించబడిందని ఈసీ తమ నిర్ణయాన్ని వెల్లడించింది.

అంతేకాదు. ఈ చిత్రంతో స్వేచ్చగా స్వతంత్ర్యంగా వున్న పరిస్థితులు ఒక్కసారిగా రాజకీయంగా కూడా మారుతాయని ఈసీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందువల్ల సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్‌ పూర్తయ్యే మే 19 వరకు విడుదలకు అంగీకరించకూడదని పేర్కొంది.  దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈసీ నిర్ణయం సబవేనని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఈసీ చర్యల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న మోదీ బయోపిక్‌లో మోదీ పాత్రను వివేక్‌ ఒబెరాయ్‌ పోషిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles