577 constables quit in 4 years ‘‘ఈ జీతాలతో జీవితాలను ఈఢ్చలేం..’’ ప్రభుత్వ ఉద్యోగాలకు రాం.. రాం..

577 constables quit in 4 years low pay and irregular weekly offs to blame

Low salary, constables, Government jobs, Private Jobs, constables resigned, Karnataka, politics

As many as 577 constables resigned from their jobs within four years of appointment. Better opportunities and less pay, uncertain weekly offs and leave, unattractive increments and retirement benefits and lack of dignity associated with constabulary have pushed them to quit, say veterans.

‘‘ఈ జీతాలతో జీవితాలను ఈఢ్చలేం..’’ ప్రభుత్వ ఉద్యోగాలకు రాం.. రాం..

Posted: 04/20/2019 09:53 PM IST
577 constables quit in 4 years low pay and irregular weekly offs to blame

ప్రభుత్వ ఉద్యోగం అందులోనూ కానిస్టేబుల్ ఉద్యోగం వద్దని రిజైన్ చేశారు కానిస్టేబుళ్లు. కేవలం 4 సంవత్సరాల్లో 577 మంది కానిస్టేబుళ్లు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఈ విషయం తాజాగా కర్నాటక పోలీస్ శాఖలో కలకలం రేపుతొంది. 2014-2018 మధ్య కర్నాటక రాష్ట్రంలో 21వేల 491 మందిని పోలీస్ కానిస్టేబుళ్లుగా రిక్రూట్ కాగా,. వీరిలో 12వేల 408 మంది సివిల్ పోలీసులు. 5వేల 60 మంది సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసులు. మరో 4వేల 23 మందిని కర్నాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ కింద ఎంపికయ్యారు. వీళ్లు ఎంతో కష్టపడి శిక్షణ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరారు. అయితే వీరిలో 577 మంది రాజీనామా చేశారు. సివిల్ కానిస్టేబుళ్లు 337 మంది.. సిటీ, డిస్ట్రిక్, స్టేట్ రిజర్వ్ కేటగిరీల్లోని మరో 93 మంది ఉన్నారు.

ఎందుకని వీరు రాజీనామా చేశారంటే..

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నెల జీతం 25వేలు నుంచి 28వేల వరకు వస్తుంది. కటింగ్స్ పోను 20 నుంచి 23వేల వరకు చేతికి వస్తుంది. ఇది ఏ మాత్రం సరిపోవటం లేదంట. ప్రతి ఏటా వేసే ఇంక్రిమెంట్ 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ప్రమోషన్, జీతం బాగా పెరగాలి అంటే ఓ కానిస్టేబుల్ 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకోవాలి. అదే బయట ఓ క్యాబ్ డ్రైవర్ నెలకు కనీసం 25వేలు సంపాదిస్తున్నాడు. కాల్ సెంటర్ ఉద్యోగి కనీస వేతం 20వేలపైనే ఉంటుంది. టాలెంట్ ఉంటే రెండేళ్లలో ఎక్కడికో వెళ్లిపోవచ్చు. ప్రైవేట్ కంపెనీల్లోనూ అవకాశాలు బాగా ఉంటున్నాయి. సంపాదించుకోవటానికి మార్గాలు ఎక్కువ ఉంటాయి. దీంతో వందల సంఖ్యలో కానిస్టేబుళ్లు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. కానిస్టేబుల్ గా 30-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ కూడా 25 వేల నుంచి 40వేల మధ్యన మాత్రమే ఉంటుంది.

కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్ లేవు. 24 గంటల డ్యూటీ. కుటుంబంతో గడిపే సమయం ఉండదు. పై అధికారుల వేధింపులు, ఒత్తిడి కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు కర్నాటక పోలీస్ శాఖ ఉన్నతాధికారులు. జీతం, వీక్లీ ఆఫ్ లు లేకపోవటం, పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపుల వల్లే కానిస్టేబుళ్లు రాజీనామా చేసి పోతున్నారని చెబుతున్నారు సీనియర్స్. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది బ్యాచిలర్స్. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వారు.

రాజీనామా చేసిన కానిస్టేబుళ్లు ఎక్కువగా టీచింగ్, బ్యాంకింగ్, రైల్వే, కాల్ సెంటర్, క్యాబ్ బిజినెస్ ఇలాంటి వాటిలోకి వెళ్లారని.. ఇంత కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ఉద్యోగాల్లో పని ఒత్తిడి, వేధింపులు తక్కువగా ఉంటాయని అభిప్రాయం కూడా వారు వ్యక్తం చేయటం విశేషం. మొత్తానికి కర్నాటక రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది పోలీస్ శాఖకు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Low salary  constables  Government jobs  Private Jobs  constables resigned  Karnataka  politics  

Other Articles