voter 'chops off finger' after voting for wrong party పొరపాటు గ్రహించి.. వేలు నరుక్కున్న యువకుడు

Bsp supporter chops off finger after realising he voted for bjp

Dalit voter, voter chopped off his finger, Pawan Kumar, BSP supporter, Abdullapur Hulasan village, Shikarpur area, Bulandshahr, BJP candidate Bhola Singh, SP-BSP-RLD alliance candidate Yogesh Verma, Pawan Kumar, BSP supporter, BJP, bhola singh, yogesh Verma, bulandshahr, uttat pradesh, politics

A Dalit voter chopped off his finger after inadvertently pressing the button of the BJP election symbol instead of the Bahujan Samaj Party (BSP) at a booth in Shikarpur area of Bulandshahr during the second phase of polling

ITEMVIDEOS: పొరపాటున బీజేపికి ఓటేసి.. వేలు నరుక్కున్న యువకుడు

Posted: 04/19/2019 04:00 PM IST
Bsp supporter chops off finger after realising he voted for bjp

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 92 పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు తన పోరపాటును గ్రహించి.. తన చేతి వేలును నరుకున్నాడు. ఓ పార్టీకి ఓటువేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఓ వ్యక్తి పొరపాటున మరో గుర్తుపై వేశాడు. దీంతో జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందిన ఆ వ్యక్తి తన వేలినే నరుక్కున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని బులందషహర్  చోటుచేసుకుంది. బులంద్‌షహర్‌ నియోజకవర్గంలో ఎస్పీ-బీఎస్సీ అభ్యర్థి యోగేశ్ వర్మకు ఓటేద్దామని వెళ్లిన యువకుడు పోరపాటున బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎంపీ బోలా సింగ్‌ కు ఓటు వేసిన ఈ ఘటనకు పాల్పడ్డాడు.

బులంద్ షహర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అబ్దుల్లాపూర్‌ హులసన్‌ గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌ (25) అనే యువకుడు బీఎస్పీ పార్టీ అభిమాని. దీంతో తమ పార్టీ తరపున ఈ సారి ఎన్నికల బరిలో నిలిచిన యోగేశ్ వర్మకు ఓటు వేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తరువాత.. ఈవీఎం దగ్గరికి వెళ్లాక పొరపాటున ఈవీఎంపై బీజేపీ గుర్తు మీటను నొక్కాడు. తీవ్ర అసహనానికి గురైన పవన్‌ కుమార్‌ ఆవేశంలో తాను ఓటు వేసిన వేలుని నరికేసుకున్నాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగానే వేలును నరికేసుకున్నానని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు, పోలింగ్ జరుగుతుండగా తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరుతున్న సిట్టింగ్ ఎంపీ బోలా సింగ్ వీడియో కూడా వైరల్ అవుతోంది. నేరుగా ఓట్లేయని అడగకపోయినా, ఓటర్ల ఆశీర్వాదం కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్టు వీడియోలో స్పష్టమవుతోంది. దీనిపై విపక్షం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో బోలా సింగ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో సాధించిన స్థానాలను నిలబెట్టుకోవాలని కమలనాథులు, తమ పట్టు నిలుపుకోవాలని ఎస్పీ-బీఎస్పీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమ వైరాన్ని పక్కనబెట్టి అఖిలేశ్- మాయలు చేతులు కలిపారు. కూటమిగా ఏర్పడి బీజేపీకి కంటిమీద కునుకలేకుండా చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kumar  BSP supporter  BJP  bhola singh  yogesh Verma  bulandshahr  uttat pradesh  politicsx  

Other Articles