EVM and VVPAT machine found at private persons house అటు అటోలో.. ఇటు ప్రైవేటు వ్యక్తి ఇంట్లో.. ఈవీఎంలు..

Evm and vvpat machine found at private persons house

Evms found in Telangana-Maharashtra border, Evms transported in Auto, jagityal, chandrababu, TDP, EVM, VVPAT, Telangana maharashta border, private person, Auto, CEO Rajath kumar, Telangana, andhra pradesh, politics

AP CM Chandrababu expressing his dissatisfaction on EVMs and VVPats to Election commmission and demanding ballot paper voting. MeanWhile in Jagityal a Evm was been carried in Auto and now the latest is an EVM and vvpat machine is kept in a private persons house.

ITEMVIDEOS: అటు అటోలో.. ఇటు ప్రైవేటు వ్యక్తి ఇంట్లో.. ఈవీఎంలు..

Posted: 04/16/2019 09:05 PM IST
Evm and vvpat machine found at private persons house

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల నిర్వహణలో ఈవీఎం యంత్రాలను, వీవీప్యాట్ లను హాక్ చేయవచ్చని దానిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకపై ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అనుమానాలను నిజం చేస్తున్నట్లుగా పలు ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా పోరుగునున్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇప్పటికే జగిత్యాలలో అర్థరాత్రి పూట అటోలో ఈవీఎం యంత్రాన్ని తరలించే విషయమై చర్చ కొనసాగుతున్న సందర్భంలోనే మరో ఈవీఎం యంత్రం ఓ ప్రైవేటు వ్యక్తి ఇంట్లో దర్శనమివ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎం తో పాటుగా వీవీ ప్యాట్ యంత్రం ఆ వ్యక్తి ఇంట్లోకి ఎలా వచ్చింది.? ఎవరు తరలించారో తెలియాల్సి వుంది. ఇక ఈ ఈవీఎంకు సీల్ వేసి వుంటడం గమనార్హం. అంతేకాదు ఈవీఎంపై 692 సీరియల్ నెంబరు కూడా వేసి వుండటంతో కలకలం రేగుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ఈవీఎం బయటపడింది. స్థానికంగా ఉన్న మదన్ సింగ్ రాథోడ్ ఇంట్లో సీలు వేసి ఉన్న ఈవీఎం, ఓ బ్యాగు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రదేశానికి వారు చేరుకుని ఆరా తీస్తున్నారు. ఈవీఎంపై 692 నెంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఈ ఈవీఎం.. వీవీఫ్యాట్ అక్కడకు ఎలా వచ్చాయన్న విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంతకుముందు జగిత్యాలలో ఈవీఎంల తరలింపు వ్యవహారం కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఎన్నికల సిబ్బంది ఆటోల్లో ఈవీఎంలను తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో... ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జగిత్యాల ఆర్డీవో మాట్లాడుతూ, ఇవి గ్రామాల్లో అవగాహన కోసం వాడిన పాత ఈవీఎంలు అని చెప్పారు. పాత స్ట్రాంగ్ రూమ్ కు వీటిని తరలించామని సమాధనపర్చారు.

పాత ఈవీఎంలు అయినప్పుడు అర్ధరాత్రి పూట వాటిని తరలించాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పగటి పూట తరలించవచ్చు కదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున కవిత ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈవీఎం యంత్రాలతో గ్యాంబ్లింగ్ చేసి కవితను గట్టేక్కించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్న పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటికే ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదులు కూడా పెద్దసంఖ్యలోనే వెళ్తున్నాయి. స్ట్రాంగ్ రూంలో ఉన్న ఈవీఎంల భద్రతపై నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్న సమయంలో ఈవీఎం బయటపడడం సంచలనం స‌ృష్టిస్తోంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఈవీఎం బయటపడ్డ విషయమై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  TDP  EVM  VVPAT  Telangana maharashta border  private person  Auto  CEO Rajath kumar  Telangana  politics  

Other Articles