ED attaches properties of Om Prakash Chautala in DA case మాజీ సీఎం అస్తులను జప్తు..

Pmla case ed attaches om prakash chautala s rs 3 68 crore assets

Enforcement Directorate, ED, ED attaches properties of former Haryana CM, Om Prakash Chautala, ED, disproportionate asset case, properties attached, money laundering case, haryana, Politics

According to the ED, four immovable properties consisting of a flat, a plot, a residential house and land in New Delhi, Panchkula and Sirsa (Haryana) worth Rs 3.68 crore belonging to Om Prakash Chautala has been attached under Prevention of Money Laundering Act, 2002 (PMLA).

నిధుల దుర్వినియోగం కేసులో మాజీ సీఎం అస్తులను జప్తు..

Posted: 04/16/2019 11:58 AM IST
Pmla case ed attaches om prakash chautala s rs 3 68 crore assets

మనీ లాండరింగ్ కేసులో హర్యాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఆస్తులను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఢిల్లీ, పంచకుల, సిర్సాలోని ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.3.68 కోట్లని ఈడీ తెలిపింది. చౌతాలాతోపాటు మరికొందరిపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈడీ స్వాధీనం చేసుకున్న వాటిలో ఫ్లాట్, స్థలం, ఇల్లు, వ్యవసాయ భూమి ఉన్నట్టు పేర్కొంది. ఇవన్నీ చౌతాలా తాను స్వయంగా నేరుగా లబ్ది పోందినట్లు ఈడీ తమ దర్యాప్తులో తేల్చింది. మనీలాండరింగ్ కేసులో చౌతాలాతో పాటు ఆయన కుమారులు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాలాపైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. 1993-2006 మధ్య చౌతాలా మొత్తం రూ.6.09 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కూడబెట్టినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Om Prakash Chautala  ED  properties attached  money laundering case  haryana  Politics  

Other Articles