2 killed as gunman opens fire during Seattle rush hour సియాటెల్ లో కాల్పులు కలకలం.. ఇద్దరు మృతి

Seattle shooting 2 killed as gunman opens fire during rush hour

Seattle, seattle shooting, seattle shooting live updates, live updates, washington, seattle police, seattle police department, gunman, fire, Washington, metro, America, United States, World, Crime

Two people in Seattle were killed and two others critically injured when a gunman opened fire on two motorists and a Metro bus, then caused a collision as he tried to flee in a stolen car during the afternoon rush hour, police said.

అమెరికాలో సియాటెల్ లో కాల్పులు కలకలం.. ఇద్దరు మృతి

Posted: 03/28/2019 01:20 PM IST
Seattle shooting 2 killed as gunman opens fire during rush hour

అగ్రరాజ్యం అమెరికా మరోసారి నెత్తురోడింది. సియాటెల్ పట్టణంలో ఓ ఉన్మాది తుపాకీతో కాల్పులు జరుపుతూ వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈశాన్య సియాటెల్ ప్రాంతంలో ఉంటున్న ఓ దుండగుడు స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తుపాకీతో హల్ చల్ చేశాడు. తొలుత కారును నిలువరించి అందులోని మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు.

కానీ ఆమె ప్రతిఘటించడంతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడకు పోలీసులు చేరుకోవడంతో అటుగా వెళుతున్న బస్సుపై కాల్పులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ సందర్భంగా శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయినప్పటికీ చాకచక్యంగా బస్సును ఆపకుండా ముందుకు తీసుకెళ్లిపోయాడు. డ్రైవర్ తో పాటు గాయపడ్డ మహిళను అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

అక్కడితో ఆగకుండా అటుగా వెళుతున్న కారుపై కూడా ఉన్మాది కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కారును నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం కారును వేగంగా తీసుకెళ్లిన దుండగుడు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో అందులోని వ్యక్తి ప్రాణాలు వదిలాడు. చివరికి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిపారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Seattle  seattle shooting  gunman  fire  Washington  metro  America  United States  World  Crime  

Other Articles