Turmeric ryots steadfast, won't withdraw papers కవితపై పోటీకి నిజామాబాద్ లో 192 మంది అభ్యర్థులు

200 farmers challenge nizamabad mp kavitha in telangana polls

farmers files nominations against CM daughter Kavitha, ballot elections in Kavitha constituency, Kavitha, Nizamabad MP, KTR, KCR, Telangana CM, Turmeric powder, MSP, Madhu Yashki goud, Congress, Telangana, politics

Farmers in Nizamabad district have been fighting against the state government to classify turmeric as a food crop and ensure a Minimum Support Price.

కవితకు బ్యాలెట్ పేపర్ కలిసోచ్చేనా.? రైతులు విత్ డ్రా చేసుకునేనా.?

Posted: 03/27/2019 08:46 PM IST
200 farmers challenge nizamabad mp kavitha in telangana polls

నిజామాబాద్ లోక్ సభ స్థానంపై తెలంగాణలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ముందస్తుగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఏకఫక్షంగా విజయం సాధించిన కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పటికీ ఈవీఎంలను మ్యానేజ్ చేసిన గెలిచారన్న అరోపణలు వస్తున్న క్రమంలో.. ఆయన కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో వందల సంఖ్యలో రైతులు ఎన్నికల బరిలోకి దిగి ఇక్కడ బ్యాలెట్ ఎన్నికలకు వెళ్లేలా చేయడం కూడా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తమ సమస్యలను పరిష్కరించాలని పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతుధర కల్పించాలని రైతులు గత కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్నా.. ఆ దిశగా అమె చర్యలు తీసుకోకపోవడంతో రైతన్నలు అగ్రహించారు. దీంతో అమెపై పోటీగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు రైతులు. అమెకు ఎన్నికల ద్వారానే ఎదుర్కోవాలని భావించిన రైతులు అమెపై పోటీకి వందల సంఖ్యలో నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. ఐతే ఎంతమంది పోటీచేస్తున్నారన్న దానిపై కొన్నిరోజులుగా చర్చ జరుగుతోండగా... ఎట్టకేలకు నిజామాబాదులో పోటీచేసే ఎంపీ అభ్యర్థుల లెక్కతేలింది.

నిజామాబాదులో 205 మంది అభ్యర్థులు మొత్తం 245 నామినేషన్లు దాఖలుచేశారు. నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు.. 12 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. దాంతో నిజామాబాద్‌లో మొత్తం 193 మంది పోటీ చేయనున్నారు. అంటే ప్రస్తుత ఎంపీ కవితపై 192 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 183 మంది పసుపు, ఎర్రజొన్న రైతులే ఉన్నట్లు సమాచారం. ఐతే నిజామాబాద్ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ కీలకం కానుంది.

ఉపసంహరణకు మరో రెండు రోజులు గడువు ఉండడంతో ఎంత మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారన్నది తేలాల్సి ఉంది. అయితే ఇవాళ మాత్రం ఒక్క రైతు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదని సమాచారం. ఒకవేళ ఎవరూ విత్‌డ్రా చేయకుంటే మొత్తం 193 మంది నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీలో వున్నట్లే. దీంతో ఈ సారి ఇక్కడ బ్యాలెట్ పేపర్లతో కూడిన ఎన్నికలు జరగడం తప్పనిసరి కావచ్చు.

ఒక లోక్‌సభ స్థానానికి 64 కంటే ఎక్కువ మంది పోటీచేస్తే బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ సీఈవో రజత్ కుమార్ వెల్లడించారు. నిజామాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయని.. 194 గుర్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంకా ఎక్కువ మంది పోటీలో ఉన్నా గుర్తులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. నిజామాబాద్‌లో బ్యాలెట్ ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. రైతులు పెద్ద మొత్తంలో నామినేషన్లు ఉపసంహరించుకుంటేనే ఈవీఎం ఎన్నికలు జరుగుతాయి. లేదంటే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kavitha  Nizamabad MP  Turmeric farmers  MSP  Madhu Yashki goud  Congress  Telangana  politics  

Other Articles