Parapet wall Collapsed in Jagan Meeting one died వైఎస్ జగన్ సభలో అపశృతి.. ఒకరు మృతి నలుగురికి సీరియస్..

One dead 4 serious as parapet wall collapsed in jagan public meeting

YSRCP president YS Jagan, YS Jagan road show in mandapeta, ys jagan road show in east godavari, YS Jagan pilli ramulamma, one died in YS Jagan Road Show, YS Jagan people's government, YS Jagan, YSRCP, Parapet wall Collapse, Mandapeta town, East Godavari, andhra pradesh, politics

One dead, 4 serious as Parapet wall collapsed in YSRCP Chief YS Jagan's public meeting. According to the reports, the health condition of some of the persons is stated to be critical. The incident took place at Mandapeta in East Godavari district.

ITEMVIDEOS: వైఎస్ జగన్ సభలో అపశృతి.. ఒకరు మృతి నలుగురికి సీరియస్..

Posted: 03/27/2019 06:12 PM IST
One dead 4 serious as parapet wall collapsed in jagan public meeting

ఎన్నికల ప్రచారహోరులో పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మరో పక్షం రోజుల వ్యవధిలో ఎన్నికలు వస్తున్న క్రమంలో అన్ని పార్టీల నేతలు రాత్రింబవళ్లు కష్టపడుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే తరుణంలో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి తరలివచ్చిన అభిమానులు.. అకస్మాత్తుగా ప్రమాదానికి గురయ్యారు.

జగన్ రోడ్ షో సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో కూడలి వద్ద రోడ్డు కిక్కిరిసిపోయింది. దీంతో తమ నాయకుడిని ఎలాగైనా చూడాలని స్థానిక అభిమానులు రోడ్డు పక్కనే వున్న భవనాలపైకి ఎక్కారు. అక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసంగిస్తుండగా, ఇక తమ నాయకుడు ఏం మాట్లాడతాడని వారంతా వేచిచూస్తున్న క్రమంలో అకస్మాత్తుగా అభిమానులు నిల్చున్న ఓ భవనం పిట్టగోడ కూలిపోయింది.

దీంతొ ఆ గోడను అసరాగా చేసుకుని సభను వీక్షిస్తున్న వైసీపీ అభిమానుల్లో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో సుమారు 20 మందికి గాయాలు కాగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. వారిలో పిల్లి రాములమ్మ అనే మహిళా కార్యకర్త చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను జగన్ పరామర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  Parapet wall Collapse  Mandapeta town  East Godavari  andhra pradesh  politics  

Other Articles