janasena commited to its promises: Eeshwari ‘‘సామాన్యులకు సామాజిక న్యాయం జనసేనతోనే సాధ్యం’’

Only janasena give social justice to comman man eeshwari

pawan kalyan, janasena, P Gannnavaram assembly constituency, Former Mla Pamula Eeshwari, Pamula Eeshwari, social justice, assembly candidates first list, janasena assembly candidates first list,stratagic selection, jana sena contestants, andhra pradesh election 2019, andhra pradesh, politics

Former Mla and Janasena contestant of P Gannnavaram assembly constituency Pamula Eeshwari says its only janasena which is commited to fulfill its promises and also gives social justice to comman man in the society.

‘‘సామాన్యులకు సామాజిక న్యాయం జనసేనతోనే సాధ్యం’’

Posted: 03/14/2019 03:38 PM IST
Only janasena give social justice to comman man eeshwari

సామాన్యులకు అందని ద్రాక్షగా మారిని సామాజిక న్యాయాన్ని అరచేతిలో అస్త్రంగా మార్చగలిగే శక్తి వున్న ఏకైక రాజకీయ పార్టీ కేవలం జనసేన పార్టీయేనని జనసేన పి.గన్నవరం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి అన్నారు. ప్రతీ సామాన్యుడికి సామాజిక న్యాయం జనసేన పార్టీ తోనే జరుగుతుందని అమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో తమ జనసేన పార్టీ కట్టుబడి వుంటుందని, ఏ విషయంలోనైనా నిజాయితీ వ్యవహరిస్తుందని అమె ధీమా వ్యక్తం చేశారు.

పి. గన్నవరం మండలంలోని పసుపల్లి లో భారీ ఎత్తున ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు జనసైనలో చేరారు. ఈ సందర్భంగా మండల జనబాట కన్వీనర్ అరిగెల సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీలో చేరిన వారికి జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  రాష్ట్ర యువత జనసేనాని నిబద్దతతు, నిస్వార్థ ప్రజాసేవ పట్ల అకర్షితులవుతున్నారని.. ఆయన అకాంక్షలను ముందుకు తీసుకుపోతున్నారని అమె పేర్కోన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ వల్లే సామాజిక న్యాయం జరుగుతుందని.. నిజాయితీ పరఢవిల్లుతుందని, నీతి, న్యాయం, ధర్మం అనేవి పదాలు కావని, మనిషి జీవన విధానంలో సూత్రాలని జనసేన వాటిని సాక్ష్యాత్కరింపజేస్తుందని అమె తెలిపారు. మనవత్వాన్ని చాటుకునే పార్టీగా.. ప్రజా సమస్యలపై శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించే ధోరణితో జనసేన ముందుకు సాగుతుందని అమె అన్నారు.

మనిషి మనిషిగా మార్చే ప్రయత్నంతో పాటు పారదర్శక పాలన అందించాలన్నదే తమ పార్టీ విధానమని అమె స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్, స్థానాలలో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీని అధిక సంఖ్యలో గెలిపించాలని కోరారు. జనసేన మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో అని ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో మహిళలకు రేషన్ కు బదులు నగదు బదిలి ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర అంశాలను వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Pamula Eeshwari  social justice  andhra pradesh  politics  

Other Articles