Navsari farmers protest land acquisition for bullet train బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా గుజరాత్ రైతుల ఆందోళన

Agri community to hold protest on feb 8 against mumbai ahmedabad bullet train

tehsil, navsari farmers protest, Navsari district, Jalalpore, Bullet train, bullet Rail, Mumbai, AHMADABAD, Farmers, FRESH AGITATION

Large number of farmers from Navsari and Jalalpore talukas organized a rally to oppose land acquisition in their talukas for the ambitious Ahmedabad-Mumbai bullet train project.

‘‘మాకొద్దు బుల్లెట్ రైలు’’ అందోళన బాటలో గుజరాత్ రైతులు

Posted: 02/07/2019 01:36 PM IST
Agri community to hold protest on feb 8 against mumbai ahmedabad bullet train

దేశానికే ప్రతిష్టాత్మకంగా మారతుందని, దీంతో గంటల ప్రయాణం కేవలం మూడు నాలుగు గంటలలోపు పూర్తవుతుందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పినా.. ఈ బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా సాక్షాత్తూ ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ రైతులు ఆందోళన బాట పట్టడం సంచలనం రేపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29 గ్రామాల నుంచి ప్రజలు బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీని నిర్వహించారు. నవ్సారి తాలుకాలో జనథాన పట్టణం నుంచి ప్రారంభమైన రైతుల నిరసన ర్యాలీ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది.

బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా 14 అభ్యంతరాలను లేవనెత్తిన 29 గ్రామాల రైతులు నిరసన ర్యాలీగా వెళ్లి.. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని వినతిపత్రాన్ని సమర్పించారు. బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం రెండులక్షల చెట్లను నరకాలని, దీనివల్ల పచ్చదనానికి తూట్లు పొడిచినట్లు అవుతుందని రైతు నాయకుడు జయేష్ పటేల్ ఆరోపించారు. బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం తమ పచ్చని పొలాలు ఇవ్వమని 29 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు.

కాగా నవ్సారి జలాల్ పూర్ తాలుకాల ఖేదుత్ సమాజ్ అధ్యక్షుడు సిపీ నాయక్ మాట్లాడుతూ.. సాగుకు అత్యంతయోగ్యమైన భూమిని ప్రభుత్వం బుల్లెట్ రైలు కోసం సేకరించడం తగదని అన్నారు. ఈ ప్రాంతాల్లో శతాబ్దానికి పైగా రైతులు మేలు రకం మామిడి పండ్లను పండిస్తున్నారని తెలిపారు. ఇలాంటి భూమిని తీసుకున్న ప్రభుత్వం తమకు ఫీటుకు యాభై నుంచి 100 రూపాయలను పరిహారంగా ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.

కాగా ఈ నెల 8న కూడా రైతులకు మద్దతుగా వ్యవసాయ సంఘాల కమిటీ కూడా భారీ ర్యాలీని, నిరసన కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం పొలాలను సేకరించి 2023లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అహ్మదాబాద్- ముంబయి బుల్లెట్ రైలు, అహ్మదాబాద్- గాంధీనగర్ మెట్రోరైలు ప్రాజెక్టుల కోసం భూములను జపాన్ పార్లమెంటరీ ఉప మంత్రి అకిమోటో మసటోషి పరిశీలించారు. రూ. 3,500 కోట్లతో నిర్మించనున్న ఈ రైలుమార్గం 508 కిలోమీటర్ల మేర ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tehsil  navsari farmers protest  Navsari district  Jalalpore  Bullet train  

Other Articles