Pawan Kalyan hints at feelers from YSRCP for alliance వైసీపీపై జనసేనాని పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan kalyan hints at feelers from ysrcp for alliance

pawan kalyan, janasena, chIntamaneni prabhakar, YSRCP, TRS, TDP, Krishna, W.Godavari, andhra pradesh, politics

Jana Sena chief Pawan Kalyan said those who criticised his party and berated its strength themselves were now sending feelers to him for an alliance.

బలాన్ని అంచనావేసే.. పొత్తుకు వెంపర్లాట: జనసేనాని పవన్

Posted: 01/12/2019 01:27 PM IST
Pawan kalyan hints at feelers from ysrcp for alliance

రాజకీయంగా తమకు బలం లేదని విమర్శలు గుప్పిస్తున్న పార్టీలు తెరచాటుగా తమతో పొత్తుకోసం ప్రయత్నాలను మాత్రం సాగిస్తున్నాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి పెద్దగా సీట్లు రావని పైకి చెబుతున్న నేతలు ఇప్పుడు తమతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని వైసీపీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా నేతలతో సమీక్షలు జరుపుతున్న పవన్ కల్యాణ్.. కృష్ణా జిల్లా నేతలతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనసేన బలంగా ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘జనసేన మాతో కలిసి రావాలని చంద్రబాబు చెప్పినా, తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ మీరు కలిసి పనిచేయాలని చెప్పినా.. అది మన బలాన్ని సూచిస్తున్నాయి. ఓట్ల శాతం ఎంత అనే విషయాన్ని పక్కనపెడతాం. మనకు బలం ఉందని తెలుసు కాబట్టే పొత్తు కోసం వాళ్లంతా ముందుకు వస్తున్నారు’ అని పవన్ వ్యాఖ్యానించారు.

అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన జనసేనాని.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  ఈ సందర్భంగా దళితులను చింతమనేని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని పవన్ దృష్టికి నేతలు తీసుకొచ్చారు. దీంతో, చింతమనేనిపై పవన్ ఫైర్ అయ్యారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోందని ప్రశ్నించారు.

తాను ఆకు రౌడీలకు, గాలి రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని పవన్ అన్నారు. తాను ఒక్క సైగ చేస్తే కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 16 ఏళ్ల వయసులోనే రౌడీలను తన్ని తరిమేశానని చెప్పారు. చింతమనేనిలాంటి వ్యక్తులను వెనకేసుకొస్తున్న టీడీపీకి తాను అండగా ఎందుకుండాలని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం తాను ఎవరితోనైనా గొడవపెట్టుకుంటానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  chIntamaneni prabhakar  YSRCP  TRS  TDP  Krishna  W.Godavari  andhra pradesh  politics  

Other Articles