Consensual sex between live-in partners not rape సహజీవన శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేం: సుప్రీం

Consensual sex between live in partners does not amount to rape if man fails to marry woman sc

Live in relationship, sexual assault, woman, consensual sex, live in partners, supreme court, maharashtra, nurse-doctor case

Consensual physical relationship between live-in partners does not amount to rape in case the man fails to marry the woman due to circumstances beyond his control, the Supreme Court has held.

సహజీవన శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేం: సుప్రీం

Posted: 01/03/2019 10:31 AM IST
Consensual sex between live in partners does not amount to rape if man fails to marry woman sc

యువతీయువకుల పరస్పర అంగీకారంతో సహజీవనం చేసిన నేపథ్యంలో ప్రేమ పూర్వకంగానే ఒక్కటై జరిపే శృంగారం అత్యాచారం కిందకు రాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఇద్దరు పరస్పరం ప్రేమించుకుని ఒక్కటిగా వున్న సమయంలో ఇద్దరి మధ్య అంగీకారంతో జరిగే శృంగారం అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. సహజీవనంలో అంగీకారంతో జరిగే శృంగారాన్ని వేరుగా, మహిళ పట్ల అమె అంగీకారం లేకుండా బలవంతంగా జరిగే ఘటనలను అత్యాచారంగా పరిగణించాలని న్యాయస్థానం పేర్కోంది.

ఇటువంటి సందర్భాల్లో బాధితురాలు ఫిర్యాదు చేస్తే కోర్టు చాలా జాగ్రత్తగా ఆచూతూచి కేసును పరిశీలించాలని సూచించింది. మహారాష్ట్రకు చెందిన ఓ నర్సు డాక్టర్‌పై వేసిన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. సహజీవనం చేస్తున్న పురుషుడు తప్పనిసరి పరిస్థితుల్లో భాగస్వామిని వివాహ మాడనంత మాత్రాన అప్పటి వరకు వారి మధ్య ఉన్న సంబంధాన్ని రేప్ గా పరిగణించలేమని స్పష్టం చేస్తూ జస్టిస్‌ ఏ.కె.సిక్రి, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారానికి, పరస్పర అంగీకార శృంగారానికి చాలా తేడా ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. భర్త చనిపోయిన తరువాత ఆ నర్సు కొన్నాళ్లుగా ఆ డాక్టర్ తో ప్రేమలోపడి అతనితో సహజీవనం చేస్తోందని, వారిమధ్య ఇష్టపూర్వక శృంగారం కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. ఇటువంటి కేసుల్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే, నిందితుని మాయలో ఆమె పడిపోయిందని కాకుండా, ఆ వ్యక్తి నిజంగా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడా? లేక కోరిక తీర్చుకునేందుకు తప్పుడు మార్గం ఎన్నుకున్నాడా?, అతని తీరులో దురుద్దేశం ఏదైనా ఉందా? అన్న అంశాలను కూలంకుషంగా పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles