telugu states Continues To Endure Cold Waves తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా.. 46 మంది మృతి

Cold wave conditions continue to grip telangana and andhra pradesh

Andhra pradesh, telangana, low temperatues, mercury falls down, phethai, phethai cyclone, low temperatue in telangana, low temperature in andhra pradesh, 44 dead in telugu states, telugu states

As per the weather department, the cold winds from northern states shivering telugu states, which bought freezing cold temperatures dropping drastically.

తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా.. 46 మంది మృతి

Posted: 12/31/2018 11:12 AM IST
Cold wave conditions continue to grip telangana and andhra pradesh

ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా చలిగాలులు వీస్తూ.. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. బయటకు రావాలంటే కూడా జనం జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరుకున్నాయి. లంబసింగిలో సున్నా డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 1.5 డిగ్రీలు, మినుములూరులో 3, పాడేరులో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

2010లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవగా... ఇప్పుడు మళ్లీ చలి పులి పంజా విసిరింది. వణికిస్తున్న చలిలో మన్నెం ప్రాంతంలోని పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విపరీతమైన పొగమంచు కారణంగా సూర్యుడు ఉదయం 11 గంటల తర్వాతే దర్శనమిస్తున్నాడు. ఇటు తెలంగాణలో కూడా చలి గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లోని బేగంపేటలో గత శుక్రవారం రాత్రి పూట 9.9 డిగ్రీల ఉష్టోగ్రత నమోదు కాగా, బీహెచ్ఈఎల్ లో అదే రోజున 6.6 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది.

శీతల పొడిగాలులతో నగరవాసులు రాత్రివేళల్లో వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున కనిష్ఠంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువ. పగటిపూట సాధారణ కంటే ఒక డిగ్రీ తక్కువగా 27.2 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర కోస్తా, ఒడిశాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్లే నగరంలో చలి తీవ్రత అధికంగా ఉందని తెలిపారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు వెళ్లాలని చెబుతున్న వైద్యాధికారులు.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పని సరిగా స్వెటర్లు, జాకెట్లు వాడాలనీ, చిన్న పిల్లలు, ముసలివాళ్లు తప్పని సరిగా ఉన్ని వస్త్రాలు వేసుకోవాలని తెలిపారు. ఆస్తమా రోగులు, చిన్న పిల్లలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని హెచ్చరిస్తున్నారు. చలి గాలుల వల్ల స్వైన్‌ఫ్లూ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వ్యాధి భారిన పడకుండా జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : low temperatues  mercury down  telugu states  Andhra pradesh  telangana  

Other Articles