'Difficult to say who will be next PM': Baba Ramdev బీజేపికి యోగా గురు బాబా రాందేవ్ షాక్..

Political situation very difficult cannot say who will be next pm baba ramdev

Spiritual India, yoga guru, baba ramdev, India, hindu india, hindu, Baba Ramdev, Baba, narendra modi, PM modi, congress, rahul gandhi, BJP, national politics

Baba Ramdev said, "Political situation is very difficult, we can't say who will be next PM. I'm not focusing on politics, I don't support or oppose anyone. We don't aim to make a communal or Hindu India, we want to make a spiritual India and world.".

బీజేపికి బాబా రాందేవ్ షాక్.. మద్దతు ఇవ్వబోనంటూ పరోక్ష సంకేతాలు

Posted: 12/26/2018 12:01 PM IST
Political situation very difficult cannot say who will be next pm baba ramdev

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ బీజేపికి షాక్ ఇచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో గత ఎన్నికల మాదిరిగా తాను బీజేపికి మద్దతు ఇవ్వబోనని చెప్పారు. అదే మాదిరిగా తాను కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకించబోనని చెప్పుకోచ్చారు. ప్రస్తుతం తన దృష్టి రాజకీయాలపై లేదంటూనే.. రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కూడా బాబా రాందేవ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తన మద్దతు ఎవరికన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు యోగా గురువు. వచ్చే ఎన్నికల్లో తాను ఏ వ్యక్తికీ మద్దతు ఇవ్వబోనని, అలాగే ఏ పార్టీనీ వ్యతిరేకించబోనని వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్రమోడీని, బీజేపి పార్టీని గతంలో వెనకేసుకువచ్చిన ఆయన.. రానున్న ఎన్నికలలో తటస్థంగా వుండనున్నట్లు చెప్పకోచ్చారు. ఉత్తరాది రాష్ట్రాలలో తన ఉనికిని చాటుకున్న బాబా రాందేవ్.. తాను బీజేపి మద్దతు ఇవ్వబోనని పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం బీజేపికి ఇబ్బందికర పరిణామమే. ఈ క్రమంలో తమ ఉద్దేశ్యం ఆధ్యాత్మిక భారతావని మాత్రమేనని, హిందూ దేశంగా భారత్ అవతరించడం కాదని కూడా ఆయన చెప్పుకోచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వెలువడి పక్షం రోజుల వ్యవధిలో రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yoga guru  baba ramdev  narendra modi  PM modi  congress  rahul gandhi  BJP  national politics  

Other Articles