UK Court orders extradition of Vijay Mallya వెస్ట్ మినిస్టర్ కోర్టులో విజయ్ మాల్యాకు షాక్

Indian tycoon vijay mallya should be extradited rules uk court

vijay mallya, vijay mallya extradition, vijay mallya case, kingfisher airlines, vijay mallya hearing, vijay mallya money laundering, kingfisher airlines bankruptcy, vijay mallya, UK court, extradition, UK Home Secretary, Kingfisher Airlines, westminister court

A UK court Monday ordered the extradition of embattled liquor baron Vijay Mallya after a year-long trial. Mallya is wanted in India on alleged fraud and money laundering charges amounting to an estimated Rs 9,000 crore.

వెస్ట్ మినిస్టర్ కోర్టులో విజయ్ మాల్యాకు షాక్

Posted: 12/10/2018 06:41 PM IST
Indian tycoon vijay mallya should be extradited rules uk court

భారత బ్యాంకుల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయాల పైచిలుకు ప్రజాధనాన్ని రుణాలుగా పోంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా మారిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు యూనైటెడ్ కింగ్ డమ్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో షాక్ తగిలింది. భారత్ నుంచి బ్రిటన్ పారిపోయిన ఆయనపై భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. రూ.9వేల కోట్ల మేర బ్యాంకులను మోసం చేయడం, మనీ లాండరింగ్‌కు పాల్పడటం వంటి నేరారోపణలున్న మాల్యా తప్పుడు సమాచారంతోనే ఇక్కడ అశ్రయం పోందుతున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఇప్పటికే ఆయన అనేక నేరారోపణలు ఎదుర్కోంటున్న ఆయన దేశం నుంచి పారిపోయిన నేపథ్యంలో ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు పలు కేసులు నమోదు చేశాయి. బ్రిటన్ లో తలదాచుకుంటున్నారన్న సమాచారం భారత ప్రభుత్వం ఆయనను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు ఆయనను అరెస్టు చేసి.. తరువాత బెయిల్ పై విడుదల చేశారు. ఇక తాజాగా ఇవాళ జరిగిన సుదీర్ఘ విచారణ అనంతరం మాల్యాను భారత్ కు అప్పగించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

అయితే ఈ తీర్పుపై 14 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకొనేందుకు మాల్యాకు కోర్టు అవకాశం ఇచ్చింది. భారత ప్రభుత్వం అభ్యర్థనపై వెస్ట్‌ మినిస్టర్ కోర్టు 2017 డిసెంబరు 4 నుంచి విచారణ జరుపుతోంది. మానవ హక్కులకు సంబంధించిన కారణాలను చూపుతూ మాల్యాను భారతదేశానికి అప్పగించేందుకు ఎటువంటి అడ్డంకులు లేవని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ దర్యాప్తు నివేదిక వెల్లడించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చతికిలబడటం అనివార్యమని మాల్యాకు ముందే తెలుసునని, బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పుడూ లేదని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijay mallya  UK court  extradition  UK Home Secretary  Kingfisher Airlines  westminister court  

Other Articles