Girl students thrash eve-teaser ఆకతాయి తాట తీసిన అమ్మాయిలు..

Girl students thrash eve teaser inside school premises

eve-teaser, eve teaser thrashed, girl students thrash eve teaser, Baghpat’s Dharam Singh inter-college, molestation, sexual assault, crime on women, crime on girl students, social media, viral video, video viral, crime

A group of female students have decided to teach a lesson to eve teaser after their complaints to the college authorities went unanswered.

ITEMVIDEOS: ఆకతాయి తాట తీసిన అమ్మాయిలు..

Posted: 12/10/2018 04:46 PM IST
Girl students thrash eve teaser inside school premises

అమ్మాయిలకు సరదాగా ఫ్లర్ట్ చేసేవాళ్లని ఇష్టపడతారు. అయితే పదిమందిలో వారిని చులకన చేసి మాట్లాడినా.. అందరికీ వినిపించేలా అసభ్యపదజాలంలో వారిని అవమానపర్చే అకతాయిలను చూస్తు వారికి కూడా ఒళ్లు రగిలిపోతుంది. తమలోని కోపం కట్టలు తెంచుకుంటుంది. అయితే పదిమందిలో అల్లరయ్యేది తామే అనుకుని.. ఆకతాయిల మాటలు వినిపించినా.. మౌనంగా తమకేమీ వినబడనట్లుగా వారు అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు.

అయితే తమ కాలేజీ వద్ద ఇలాంటి అకతాయిల వ్యవహారం రోజురోజుకు శృతిమించిపోతుండటంతో ఉండబట్టలేని కాలేజీ విద్యార్థినులు తమ కళాశాల యాజమాన్యం దృష్టికి అనేక పర్యాయాలు తీసుకువెళ్లారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అకతాయిల పోకిరి వేషాలు మరింతగా పెరిగిపోయాయి. వీటి బారి నుంచి తాము ఎలాగైనా బయటపడాలని, లేకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని విద్యార్థినులు భావించారు.

అంతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కూడా వెనుకాడలేదు. అయితే సభ్యసమాజంలో అమ్మాయిల బాధను అర్థచేసుకున్న ఓ టీచర్ మాత్రం వీరికి మద్దతు ఇచ్చేందుకు సిద్దమైంది. అమె అండతో ముందుగానే ప్రణాళిక రచించుకున్న విద్యార్థునులు తమ కాళాశాల అవరణలోకి పోకిరీ రాగానే.. వాడు తప్పించుకోకుండా ముందుగా ప్రధాన గేటుకు తాళం వేశారు. తమ ముఖాలకు ముసుగులు ధరించిన విద్యార్థునులు ఇక తమ చేతుల్లోకి కర్రలు తీసుకని అకతాయి తాట తీశారు.

అయితే ఒక్క నిమిషం అంటూ అకతాయి పరుగు లఖించుకున్నా.. పారిపోయే వీలు మాత్రం లేకపోయింది. గేటు వద్దకు పరుగులు తీసినా దానికి తాళం వేసివుండటంతో.. పోకిరీ తరగతి గదుల్లోకి వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేశాడు. అయినా అమ్మాయిలు మాత్రం వాడిని వదలిపెట్టలేదు. ఈ తతంగానంతా వీడియో తీసిన అక్కడి మరికొందరు విద్యార్థునులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇక అలస్యమెందుకు అమ్మోరుగా మారిన అమ్మాయిల వీడియోను మీరు తిలకించండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eve-teaser  thrash  girl students  Baghpat’s Dharam Singh inter-college  crime  

Other Articles