JSP pawan political train journey to Tuni జనంలోకి జనసేన ఎక్స్ ప్రెస్.. పలువర్గాలతో పవన్ చర్చలు

Pawan kalyan interacts with farmers railway employees students in janmabhoomi express

pawan kalyan, janasena, Pawan Kalyan train Yatra, pawan kalyan praja porata yatra, pawan kalyan interacts, pawan kalyan tuni yatra, pawan kalyan vijayawada to tuni yatra, Pawan Kalyan public meeting, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan interacts with farmers, railway employees, students in janmabhoomi express on his political train journey to Tuni

జనంలోకి జనసేన ఎక్స్ ప్రెస్.. పలువర్గాలతో పవన్ చర్చలు

Posted: 11/02/2018 05:28 PM IST
Pawan kalyan interacts with farmers railway employees students in janmabhoomi express

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. వామపక్ష పార్టీలతో కలసి ఈ సారి ఎన్నికలలో ప్రత్యక్షపోరులోకి దిగనున్న నేపథ్యంలో తన పార్టీని మరింత వేగంగా, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ కల్యాణ్ తనదైన శైలిలో సరికొత్త విధానాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో రోజుల పాటు పర్యటనలు చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై ఓ వైపు అధ్యయనం చేస్తూనే మరోవైపు మరింతగా జనంలోకి చోచ్చుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇందులోభాగంగా జనం చెంతకు వెళ్లేందుకు సరికొత్తగా రైలుమార్గాన్ని ఎంచుకుని.. ఈ ప్రయాణంలోనే రైలు అగే పలు స్టేషన్ల వద్ద వివిధ వర్గాల ప్రజలతో కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రారంభమైన జనసేనాని పవన్ కల్యాణ్ ప్రయాణం తుని వరకూ కొనసాగనుంది. ఈ సమాచారం అందుకున్న పవన్ అభిమానులు రైల్వే స్టేషన్ల వద్దకు రావద్దని, కేవలం పలు వర్గాల ప్రజలతో కలసేందుకు పవన్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారని జనసేన వర్గాలు తేల్చిచెప్పినా.. అభిమానులు మాత్రం పెద్దస్థాయిలో చేరుకుని జనసేన నినాదాలు చేస్తున్నారు.

'జనసేనానితో రైలు ప్రయాణం' పేరిట యాత్ర సాగనుండగా, పలు వర్గాల ప్రజలతో పవన్ మాట్లాడనున్నారు. విజయవాడ స్టేషన్ లో రైల్వే పోర్టర్ల సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేనాని, నూజివీడులో మామిడి రైతులతో మాట్లాడారు. ఏలూరులో అసంఘటిత కార్మికులు, సాధారణ ప్రయాణికులను కలసి వారితో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపై తాడేపల్లి గూడెంలో చెరకు రైతులతో, రాజమండ్రిలో టెక్స్ టైల్ కార్మికులతో రైల్లోనే సమావేశం అయ్యారు. సామర్లకోటలో విద్యార్థులతో కూడా ముచ్చిటించిన పవన్, అన్నవరంలో ఏటికొప్పాక బొమ్మల తయారీ కార్మికులతో చర్చించారు. ఇక మరికాసేట్లో తునిలో బహిరంగ సభకు హాజరుకానున్నారు.

ఈ సందర్బంగా వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి అంశానికి సంబంధించిన స్పందించిన పవన్ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. దాడి అంశంపై సరైన రీతిలో స్పందించాల్సిన ప్రభుత్వం... వెకిలిగా మాట్లాడుతుండటం దారుణమని చెప్పారు. దాడి ఘటనను లోతుగా విచారించాలని అన్నారు. కావాలని నిందితుడు దాడి చేశాడా? లేక ఇతరుల ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారించాలని సూచించారు. దాడి వెనక కుట్ర ఏమైనా ఉందా అనే విషయం విచారణలో తేల్చాలని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు దారుణమని... ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దాహానికి ఇదొక నిదర్శనమని అన్నారు. పదవిని కాపాడుకోడానికి, ఉనికిని చాటుకోడానికే చంద్రబాబు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ... రాష్ట్రం కోసం తాను టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికే తాను యాత్రలు చేస్తున్నానే తప్ప... అధికారామే పరమావధిగా కాదని పవన్ కల్యాణ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles