drunkard nitesh warns police at jubilee hills ఎంపీ కవిత ఫ్రెండ్ అంటూ మందుబాబు బుకాయింపు

Trs mp kavitha is my friend drunkard nitesh warns police

drunk and drive test, jubilee hills, nitesh, madhapur, hyderbad police, Ruling party, TRS MP kavitha, MP kavitha, media, crime

Do you know who am I, TRS MP kavitha is our Family Friend, warns a drunkard nitesh after, been caught by the police at jubilee hills check post.

ITEMVIDEOS: మందుబాబు.. ఎంపీ కవిత ఫ్రెండ్ అంటూ బుకాయింపు

Posted: 10/29/2018 02:47 PM IST
Trs mp kavitha is my friend drunkard nitesh warns police

పీకల వరకు మధ్యం సేవింది ఒళ్లుపై తెలియక తమ వాహనాల్లో రోడ్లపైకి వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే మద్యంబాబులు హైదరాబాద్ లో రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వీరి అటలు కట్టించడానికి పోలీసులు అర్థరాత్రిళ్లు కూడా విధులు నిర్వహిస్తూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడుతున్నా.. మందుబాబుల్లో కాసింత కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్న భావన మాత్రం రావడం లేదు. ఇక పోలీసులు తనిఖీలు చేపడుతుండటంతో వారిని తప్పించుకుని వెళ్లేందుకు మార్గాలను అన్వేషిస్తూ అనవసర ప్రమాదాలకు గురవుతున్నారు.

అయితే గత ఏడాదికి పూర్వం వున్నట్లుగా రాత్రి పదిగంటల వరకే మద్యం దుకాణాలు అమ్మకాలు సాగించేందుకు బదులు ఈ ఏడాది ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుతో అర్థరాత్రిళ్ల వరకు బార్లు బార్ల తెరిచి మధ్యం అమ్మకాలు సాగిస్తుండటంతో.. ముందుబాబుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తి చేసిన హంగామా తక్కువ కాదు. తానెవరో తెలుసా? అంటూ భయపెట్టాడు.

టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్నేహితుడినని, తనతో పెట్టుకోవద్దని బెదిరించాడు. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లకు ఇంగ్లిష్ రాదంటూ ఎద్దేవా చేశాడు. శనివారం రాత్రి హైదరాబాద్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఈ ఘటన  చోటుచేసుకుంది. మాదాపూర్ కు చెందిన నితీశ్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఆల్కహాల్ టెస్టు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా హల్‌చల్ చేశాడు. పోలీసులను బెదరగొట్టాడు.

తన ఫోన్ తీసి ఎంపీ కవిత ఫొటోను చూపిస్తూ.. ఆమె తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ హంగామా చేశాడు. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లకు గవర్నమెంట్, సైకాలజీ వంటి చిన్న ఇంగ్లిష్ పదాలకు కూడా స్పెల్లింగ్ తెలియదని ఎద్దేవా చేశాడు. చివరికి అతి కష్టం మీద అతడికి ఆల్కహాల్ టెస్టు నిర్వహించగా మద్యం తాగినట్టు తేలింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles