vishaka TDP leaders join Janasena జనసేనలోకి విశాఖ అధికార పార్టీ నేతలు

Vishaka yalamanchili tdp leaders join janasena

pawan kalyan, janasena, TDP, Sundarapu Vijaykumar, mungapaka, henna, zptc member, villa srinivasa rao,gopalapatnam, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, andhra pradesh, politics

Vishakapatnam yalamanchili ruling party (TDP) leaders join Janasena under the leadership of Actor turned politician Jana Sena chief pawan kalyan.

జనసేనలోకి విశాఖ అధికార పార్టీ నేతలు

Posted: 10/20/2018 02:23 PM IST
Vishaka yalamanchili tdp leaders join janasena

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీలోకి అధికార, విపక్ష పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో తాజాగా మరికొంతమంది నాయకులు చేరారు. శ్రీకాకుళం జిల్లాలో తుఫాను బాధితులను పరామర్శించేందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ను శ్రీకాకుళంలో కలిసిన కోందరు అధికార పార్టీ నేతలు.. అధికారికంగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పవన్ కల్యాణ్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు.

ఇలా చేరినవారిలో టీడీపీ పార్టీకి చెందిన నాయకుడు ఎలమంచిలి నుంచి పోటీ చేయాలని ప్రయత్నించి విఫలమైన సుందరపు విజయకుమార్‌ కూడా వున్నారు. ఆయన తన అనుచరగణంతో కలసి జనసేన పార్టీలో చేరారు.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి దగ్గరగా వుంటున్న పవన్ కల్యాణ్‌ సిద్ధాంతాలు నచ్చాయని, ఆయనలా ప్రజలకు అండగా వుండేందుకు జనసేనలో చేరానని పేర్కొన్నారు. ఆయనతో పాటుగా మునగపాక టీడీపి పార్టీకి చెందిన దివంగత జెడ్‌పీటీసీ సభ్యుడు దాడి లక్ష్మీసత్యనారాయణ సతీమణి హెన్నా కూడా జనసేన పార్టీలో చేరారు.

గోపాలపట్నానికి చెందిన బిల్డర్‌ విల్లా శ్రీనివాసరావు గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు. ఇప్పుడు జనసేనలో చేరారు. గాజువాక(మింది)కి చెందిన ఈటి రంగారావు, పాయకరావుపేటకు చెందిన శివదత్‌, యంగ్‌ ఇండియా ట్రస్టు ప్రతినిధి పి.వెంకట సురేశ్‌, విశాఖకు చెందిన న్యాయవాది చంద్రమౌళి తదితరులు పార్టీలో చేరారు. వైసీపీ మహిళా విభాగం ప్రతినిధి పసుపులేటి ఉషాకిరణ్‌ జనసేనలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి ఆహ్వానం అందిందని సమాచారం. వైసీపీలో తగిన న్యాయం జరగకపోవడంతో ఆమె జనసేనలోకి వెళతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  telugu desam party  Sundarapu Vijaykumar  andhra pradesh  politics  

Other Articles