Chadalavada Krishnamurthy joins Janasena జనసేనలోకి మాజీ టీటీడీ చైర్మన్ చదలవాడ..

Pawan kalyan warns tdp government on his srikakulam visit

pawan kalyan, janasena, ex ttd chairman, Chadalavada Krishnamurthy, Chandrababu, TDP, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan titli storm, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan warns AP Government to stop critisizing him and his party kavathu (mass march). the power star says his tour in effected srikakulam may show impact on resue operations.

టీడీపీ నేతలకు జనసేనాని పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..

Posted: 10/18/2018 04:07 PM IST
Pawan kalyan warns tdp government on his srikakulam visit

జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. గత వారమే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరగా, విజయవాడకు చెందిన మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని ప్రకటించారు. ఇక తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి కూడా పవన్‌కు జైకొట్టారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌ను కలిసి.. పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చదలవాడకు పార్టీ కండువా కప్పి.. సాదరంగా ఆహ్వానించారు జనసేనాని. కృష్ణమూర్తితో పాటూ మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరారు.

జనసేన విధానాలు, పవన్‌ సేవా దృక్పథాలు నచ్చి పార్టీలో చేరానన్నారు చదలవాడ. పార్టీలో చేరడం సంతోషంగా ఉందని.. తిరుపతి, చిత్తూరుజిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కృష్ణమూర్తి జనసేనలో చేరడం శుభపరిణామమన్నారు పవన్. సీనియర్ నేతలు పార్టీకి ఎంతో ముఖ్యమని.. మొదటి నుంచి తమ కుటుంబానికి ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.

చదలవాడ కృష్ణమూర్తి రాజకీయాల్లో సీనియర్ నేతగా ఎదిగారు. 1973లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 1981లో నాయుడుపేట సర్పంచ్‌గా గెలిచారు. 1994లో తిరుపతి టిక్కెట్ ఆశిస్తే.. కాంగ్రెస్ శ్రీకాళహస్తి టిక్కెట్ వచ్చింది. కాని ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 1999లో కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరి.. ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్‌గా నియమించారు. కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన.. చివరికి జనసేనలో చేరారు.

తిత్లీ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘జియో ట్యాంగింగ్ ద్వారా తమకు జరిగిన నష్టాన్ని ఫొటోలు తీసి పంపాలని ప్రజలను కోరుతూ.. ఏపీ సర్కారు ఓ యాప్ ప్రారంభించింది. కానీ ఆరు రోజులు గడిచినప్పటికీ.. ఇంకా సగం గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయ’ని పవన్ తెలిపారు. చీకట్లో మగ్గుతున్న వారికి వెలుతురును ప్రసాదించడంటూ సీఎం చంద్రబాబును కోరుతూ పవన్ ట్వీట్ చేశారు. బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారని జనసేనాని తెలిపారు.

‘సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో నా పర్యటన కారణంగా పునరావాస, సహాయక కార్యక్రమాలకు అటంకం కలుగుతుందని అలాంటివి జరగకూడదనే తాను పర్యటనను కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకున్నానని పవన్ అన్నారు. తన పర్యటన వల్ల ఎలాంటి అవరోధాలు తలెత్తొద్దని భావించానన్నారు. అందుకనే తన పర్యటనను వాయిదా వేసుకున్నానని చెప్పారు. అంతే కానీ కవాతు వల్ల కాదని పవన్ తెలిపారు. విమర్శలు దిగే ముందు నిగ్రహం పాటించడం నేర్చుకోవాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు.

ఇక మరో ట్వీట్ లో.. మీరు చేసే ప్రతి అర్థ రహితమైన విమర్శకు భవిష్యత్తులో జవాబుదారీతనం వహించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఏదీ మా దృష్టికి రాకుండా పోవడం లేదంటూ టీడీపీ నేతలను జనసేనాని హెచ్చరించారు. జనసేన పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ. మా క్షేత్ర స్థాయి పర్యటనలను విమర్శించడం మానుకోండి. టీడీపీ విజయంలో మేం కీలక పాత్ర పోషించిన విషయం మర్చిపోవద్దని పవన్ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles