Sabarimala temple opens gates for women శబరిమల ఆలయం వద్ద టెన్షన్..

Tension grips kerala as sabarimala temple opens gates for women

Lord Ayyappa, Ayyappa swamy temple, Nilackal, women, protesters, kerala police, Sabrimala, sabrimala women, sabrimala kerala, Sabrimala temple, sabrimala entry, kerala goverment

Tensions are high in Kerala as Sabarimala temple gates were opened today to all devotees, including women, for the first time since a Supreme Court order overturned a centuries-old ban on women.

శబరిమల ఆలయం వద్ద టెన్షన్.. మహిళలకు అండగా పోలీసులు

Posted: 10/17/2018 01:32 PM IST
Tension grips kerala as sabarimala temple opens gates for women

కేరళలోని ప్రవిత్ర పుణ్యక్షేత్రం శబరిగిరీశుడి అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. స్థానికంగా మహిళా భక్తులకు, అందోళనకారులకు మధ్య ఉద్రిక్తతను రాజేస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అనంతరం శబరిమల ఆలయం తొలిసారిగా ఇవాళ తెరుచుకోవడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు మహిళలు ఇవాళ పంబకు చేరుకున్నారు.

అందోళనకారులు నిరసనలతో అట్టుడుకుతున్న శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు చేపట్టారు. అయ్యప్ప దర్శనార్థం వచ్చిన మహిళలకు పోలీసులు రక్షణగా నిలిచి అలయ దర్శనానికి తీసుకెళ్లారు. అయితే ఆలయంతో పాటుగా ఆలయానికి చేరుకునే అనేక మార్గాల్లో అందోళనకారులు మహిళలను ఎట్టి పరిస్థితుల్లో ఆలయ ప్రవేశం చేయనీయమని.. వారిని అడ్డుకునేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు.

శబరిమలకు వెళ్లే ప్రధాన మార్గం అయిన నీలక్కల్‌ వద్ద ఆందోళనకారులు ఆలయం వైపు వెళ్తున్న మహిళలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఆలయానికి 20 కి.మీ దూరం ఉండే నీలక్కల్‌ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షించారు. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ శబరిమల ఆచార సంరక్షణ సమితి సభ్యులు నీలక్కల్‌ వద్ద ఆందోళనకు దిగారు. టెంట్లు వేసుకొని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బస్సులు, వాహనాలను నిలిపివేసి అందులో ఆలయ దర్శనానికి వెళ్తున్న మహిళలను దింపివేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని.. టెంట్లను తొలగించి వారిని చెదరగొట్టారు. భక్తులను అడ్డుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నీలక్కల్‌ ప్రాంతం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. ఇక్కడ 800 మంది పోలీసులతో పాటు 200 మంది మహిళా పోలీసులు కూడా మోహరించారు. ఇక సన్నిధానం వద్ద మరో 500 మంది పోలీసులు సుప్రీంకోర్టు అదేశాలను పాటించేందుకు రంగంలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sabrimala temple  Lord Ayyappa  Nilackal  women  protesters  kerala police  kerala goverment  

Other Articles