43% Telangana residents paid bribes: Survey తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి జాడ ఎంతంటే..

43 telangana citizens paid bribes to avail essential services

Most corrupt state, Telangana corrupt, corropt telangana, KCR, KTR, Harish Rao, Local circles, noida, Transparency International India, cms india, Tamil Nadu, Telangana, Punjab, Andhra Pradesh, Gujarat, srivastava in telangana, rajasthan, karnataka, delhi, bihar, uttarpradesh, madhya pradesh, maharashtra, west bengal, politics

As per India Corruption Survey 2018, 43 per cent Telangana residents admitted that they have paid bribes to government officials for obtaining essential public services.

తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి జాడ ఎంతంటే..

Posted: 10/13/2018 02:24 PM IST
43 telangana citizens paid bribes to avail essential services

పారదర్శక పాలనలో మేమే నెంబర్ వన్ అంటూ బాడాయి కొడుతూ ప్రజలకు మాయమాటలను చెప్పి అదే నిజమనేట్లు భ్రమింపజేస్తు్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మరోమారు షాక్ తగిలింది. తమ హయాంలో ఎక్కడైనా అవినీతి కనిపిస్తుందా.? నీతివంతమైన పాలన అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని బడాయి చెప్పుకునే ప్రభుత్వాలు.. అవినీతి ఎక్కడ, ఎలా, ఏ రూపంలో వున్నా దానిని సహించం.. అంటూ ప్రసంగాలు ఉదరగోడుతున్నారు. అయితే వారు చెప్పే బడాయిలకు వాస్తవికతకు ఏమాత్రం పోలిక లేదని వస్తున్న అరోపణల్లు నిజముందా.? అంటే అవుననే అంటున్నాయి తాజా సర్వే ఫలితాలు.

తెలంగాణలో అవినీతి, లంచగొండితనం ఏ స్థాయిలో వుందో, ఏ స్థాయి అధికారుల నుంచి ఎక్కడి వరకు పాకిందో అద్దంపట్టే విధంగా సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సెన్ సంబంధించిన వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. అయితే ఆ విడియోలో వున్నది మూరెడు అయితే వాస్తవానికి బయట వున్నది బారెడని గత కొన్ని మాసాల కింద 'సెంటర్ ఫర్ మీడియా స్టడీస్-సీఎంఎస్' నిర్వహించిన సర్వేలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. అంతేకాదు ఈ సర్వేలో విస్మయం గొలిపే నిజాలే బహిర్గతం కావడంతో దీనిపై అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ తమకేమీ పట్టనట్లు వ్యవహరించాయి.

దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సర్వేలో తెలంగాణ రెండో స్థానంలో, అంధ్రప్రదేశ్ నాలుగోస్థానంలో వుండటం.. ప్రభుత్వాల పారదర్శకతకు, ప్రభుత్వ పెద్దల ప్రసంగాలకు దర్పణం పడుతుంది. అయితే ఇది ఎప్పుడో నిర్వహించిన సర్వే కదా.. అని భావిస్తే.. తాజాగా నిర్వహించిన సర్వేలోనే అవే విషయాలు మళ్లీ వెలుగుచూడటం.. తప్పు బయటపడిన తరువాత కూడా వాటిని సరిదిద్దుకునే యోచనకు ప్రభుత్వాలు పాటుపడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాజా సర్వేలో కాసులు లేదనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో తమ ఫైళ్లు విషయంలో కదలిక లేదని ప్రజలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తాము లంచాలు ఇచ్చామని 43 శాతం మంది ప్రజలు వెల్లడించారు. నోయిడాకు చెందిన సోషల్ మీడియా వేదిక ‘లోకల్ సర్కిల్స్’ చేసిన ఇండియా అవినీతి సర్వే 2018లో తెలంగాణ అధికారుల అవినీతి వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలో పౌరసేవల కోసం తాము లంచం ఇచ్చామని 43 శాతం మంది ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు. అవినీతిలో తెలంగాణ 8 వ స్థానంలో నిలిచిందని సర్వేలో తేలింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2017లో అవినీతిలో ఆరవస్థానంలో నిలవగా ఈ ఏడాది 11వస్థానానికి వచ్చింది. మొత్తం మీద రెండు తెలుగురాష్ట్రాల్లో అవినీతి ఎక్కువేనని సర్వేలో వెలుగుచూసింది. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లలో 68 శాతం అక్రమాలు సాగుతున్నాయని తేలింది. పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్లలో అవినీతి ఎక్కువగానే ఉందని సర్వేలో వెల్లడైంది. ఏపీలో 50 శాతం అవినీతి రిజిస్ట్రేషన్ల శాఖలో ఉందని, అనంతరం పోలీసు, విద్యుత్ బోర్డు, రవాణ శాఖల్లో అమ్యామ్యాలు అధికంగా తీసుకుంటున్నారని తేలింది. భూముల రిజిస్ట్రేషనుకు, పోలీసులకు తాము లంచం ఇచ్చామని 38 శాతం మంది తెలుగుప్రజలు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles