WhatsApp voicemail give hackers access to account వాట్సాఫ్ వాయిస్ మెయిల్ తో అప్రమత్తం..

Whatsapp voicemail scam could give hackers access to your account

WhatsApp, hackers, cyber criminals, voicemail inboxes, Naked Security, British security company Sophos. Israel's National Cyber Security Authority, warning, Scammers, crime

A worrying new WhatsApp hack could give cyber criminals access to your account. Scammers attempt to gain access to a user's account by taking advantage of weakly secured voicemail inboxes, according to Naked Security, a blog run by British security company Sophos.

వాట్సాఫ్ వాయిస్ మెయిల్ తో భద్రం.. అప్రమత్తత లోపిస్తే డాటా చౌర్యం..

Posted: 10/09/2018 04:14 PM IST
Whatsapp voicemail scam could give hackers access to your account

ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిపెట్డ్ అంటూ ఎంతో మంది నమ్మకంగా తమ వాట్సాప్ యాప్ ద్వారా అనేక రకాల డాక్యూమెంట్లు.. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రహస్యాలను కూడా తమ స్నేహితులతో పంచుకునేందుకు ఉపయోగించే సాధనం వాట్సాప్. అటు ప్రపంచంలోని కొన్ని ప్రభుత్వాలు ఫేక్ మెసేజ్ లపై ఉక్కపాదం మోపేందుకు సమాచారం అందించాలని కోరినా.. నిద్వందంగా తోసిపుచ్చుతూ.. తమ కస్టమర్ల డేటాను రివీల్ చేయడం కుదరదని నిక్కచ్చిగా చెప్పిందీ సంస్థ.

అయితే అంతటి భద్రతా ప్రమాణాలు పాటించే వాట్సాప్ లో కూడా డేటా చౌర్యం జరుగుతుందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా పాశ్యాత దేశాలు వణికిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ను హ్యాక్ చేసేందుకు అత్యల్ప భద్రత వున్న వాట్సాప్ వాయిస్ మెయిల్ బాక్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బ్రిటీష్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ కు చెందిన నెకడ్ సెక్యూరిటీ అనే అనే బ్లాగు ప్రచురించింది.

అంతేకాదు వాయిస్ మెయిల్ బాక్సులను ఆధారంగా చేసుకుని జరుగుతున్న ఈ సైబర్ నేరాలు ఎంతలా వున్నాయంటే.. ఏకంగా ఇజ్రాయిల్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ అధారిటీ తమ దేశవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేసే స్థాయిలో వున్నాయి. ఇందుకోసం హ్యాకర్లు ఏం చేస్తున్నారు.? అంటే తమ వద్దనున్న మోబైల్ లో వాట్సాప్ యాప్ ను వేసుకుని ఏదో ఒక ఫోన్ నెంబరును ఎంటర్ చేస్తారు. దీంతో వాట్సాప్ తమ ఆరు సంఖ్యల లాగిన్ డీటైల్స్ ను సదరు ఫోన్ నెంబరు గల వ్యక్తి మోబైల్ కు పంపుతుంది.

అయితే ఈ ప్రక్రియను హ్యాకర్లు తెలివిగా కేవలం అర్థరాత్రి పూట అందరూ నిద్రించే సమయంలో ప్రయోగించడంతో.. సదరు మోబైల్ ఫోన్ నెంబరు గల వ్యక్తి ఫోన్ ను తీయడం, లేదా వాట్సాప్ నుంచి వెలువడే సౌండ్ ను పెద్దగా పట్టించుకోరు. దీంతో ఆరు అంకెల సెక్యూరిటీ కోడ్ మేసేజ్ కాస్తా వాయిస్ మెయిల్ బాక్స్ లోని ఆటోమేటెడ్ మెసేజ్లోకి వెళ్తుంది. దీంతో సైబర్ నేరగాళ్లు దీనిని సదావకాశంగా తీసుకుని భద్రత అంతంతమాత్రంగా వుంటే నాలుగు అంకెల సెక్యూరిటీని చేధిస్తారు. ఎందుకుంటే ఇవి ఏక్కువగా ఫ్యాన్సీగానే వుంటాయి.

దీంతో వాయిస్ మెయిల్ లోకి వెళ్లి వారికి చెందిన వాట్సాప్ డిజిటల్ కోడ్, లాగిన్ డీటైల్స్ ను ఈజీగా పోందుతారు. అందుకనే ఏ సెక్యూరిటీ అయినా ఫ్యానీది కానీ పేరుతో, మీ ఇంటి సభ్యుల పేరుతో ముడిపడింది పెట్టరాదు. తరచు సెక్యూరిటీ కోడ్ మార్చుతూ వుండాలి. ఇలా చేయడంతో మీ వాట్సాప్ అకౌంట్ డీటైల్స్ అక్రమార్కుల చేతిలో పడకుండా వుంటాయి. అంత అప్రమత్తత అవసరం ఏముందా అని భావిస్తే.. మీ డాటా తస్కరణకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. నష్టం జరిగకముందే అప్రమత్తంగా వ్యవహరించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp  hackers  voicemail inboxes  Naked Security  Sophos  Israel  warning  crime  

Other Articles