Rafale Deal: conspiracy on south India దక్షిణంపై కుట్ర, అస్మదీయులకు ‘రాఫెల్’ కాంట్రాక్టు

Conspiracy collusion to benefit modi s crony friend in rafale deal

strong defence base in southindia, HAL, Bengaluru, Hyderbad, Rafale Deal, conspiracy, collusion, Crony Friend, congress, Rahul Gandhi, Anil Ambani, PM Modi, nitin gadkari, Nagpur, political gain, employment

The government's "complicity, collusion and conspiracy" to benefit PM Modi's "crony friend" and to takeaway storng defence base from south india to Nagpur

రాఫెల్ డీల్: దక్షిణంపై కుట్ర, అస్మదీయులకు కాంట్రాక్టు

Posted: 10/09/2018 05:16 PM IST
Conspiracy collusion to benefit modi s crony friend in rafale deal

రాఫెల్ డీల్‌ను అనిల్ అంబానీకి కట్టబెట్టడం వెనక భారీ కుట్ర దాగివుందని, దీంతో దక్షిణాదిని దారుణంగా దెబ్బతీయాలని పథకం కూడా వుందని రక్షణ రంగ నిపుణులు పేర్కోంటున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ లో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, ఈ డీల్ ‌ను అస్మదీయులకు కట్టబెట్టడంలో మరో భారీ కుట్ర దాగి ఉందని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యూపీఏ హయాంలో మొత్తం 126 రాఫెల్ ఫైటర్ జెట్స్‌కు ఒప్పందం కుదిరింది.

ఇందులో భాగంగా 18 విమానాలను నేరుగా ఫ్రాన్స్ నుంచి సరఫరా చేయాల్సి ఉండగా, మిగతా 108 విమానాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ద్వారా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో తయారు చేయాలనేది నిబంధన. అయితే, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూపీఏ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పక్కనపెట్టి తొలుత కుదుర్చుకున్న సంఖ్యకు రెట్టింపు స్థాయిలో 36 విమానాలను నేరుగా ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునేలా ఒప్పందాన్ని సవరించారు.

అంతేకాదు, భాగస్వామిగా ఉన్న హెచ్ఏఎల్ ను తప్పించి అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ డిఫెన్స్ ను భాగస్వామిగా చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద కుట్ర ఉందని రక్షణ రంగ నిపుణులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ విమానం ధరలను భారీగా పెంచడం, అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టడం వెనక దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీసే భారీ కుట్ర ఇందులో దాగి ఉందని అంటున్నారు. గత ఒప్పందం ప్రకారం 108 విమానాలను హెచ్ఏఎల్ లో తయారు చేయాలి.

అయితే హెఛ్ఏఎల్ ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉండగా, ఏరోనాటిక్స్ విభాగం హైదరాబాద్ లో ఉంది. 108 విమానాలను హెచ్ఏఎల్ లోనే తయారు చేసి ఉంటే దక్షిణాదికి ఎంతో ఆదాయంతోపాటు పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి.ఇక, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో పాటు పలు సంస్థలు దక్షిణాదిలోనే ఉన్నాయి. దేశ రక్షణకు సంబంధించిన అణ్వస్త్రాలు, యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాల తయారీలో దక్షిణాదే కీలకం. రక్షణ శాస్త్రవేత్తల్లో అత్యధికులు దక్షిణాదివారే వుండటం గమనార్హం.

ఈ గణంకాల నేపథ్యంలో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన.. రాఫెల్ డీల్ ను ఆయుధంగా మార్చుకుని విమాన తయారీ రంగాన్ని దక్షిణాది నుంచి తరలించేందుకు.. రాజకీయ ఎత్తుగడ వేసి.. ప్రాంతీయ పార్టీలు, లేదా కాంగ్రెస్ కు అధికంగా ప్రాధాన్యమిచ్చే దక్షిణాదిని దెబ్బతీయాలనే భారీ కుట్ర ఇందులో ఉందని చెబుతున్నారు. రాఫెల్ డీల్ లో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ నాగ్‌పూర్ లో ఉంది. దక్షిణాదిలోనే ఏర్పాటు చేయాల్సిన ఈ కంపెనీ.. గడ్కరీ ఒత్తిడి కారణంగా నాగ్ పూర్ లో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అనిల్ అంబానీ స్వయంగా పేర్కొన్నారు.

మరోవైపు 1996 నుంచి బెంగళూరు శివారులోని యెలహంకలో ప్రతీ రెండేళ్ల కోసారి నిర్వహిస్తున్న ఏరో ఇండియా విమాన ప్రదర్శనను కూడా లక్నోకు తరలించే ప్రయత్నం జరుగుతోంది. నిజానికి రాఫెల్ పాత ఒప్పందం ప్రకారం 108 విమానాలను తయారీ హెచ్ఏఎల్ కు దక్కి ఉంటే తయారీకి ఏడెనిమిదేళ్లు పట్టేది. ఈ డీల్ విలువ రూ.70 వేల కోట్లు. తయారీ తర్వాత మరో 20-30 ఏళ్లు విమాన నిర్వహణ కూడా హెచ్ఏఎల్ కే ఉండేది. అంటే మొత్తంగా దక్షిణాదికి బోలెడన్ని ఉపాధి అవకాశాలు, ఆదాయం లభించి ఉండేది. ఇప్పుడీ డీల్ ను రద్దు చేయడం ద్వారా వాటన్నింటినీ కేంద్రం కాలరాసిందనేది విశ్లేషకుల మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HAL  Bengaluru  Hyderbad  Rafale Deal  conspiracy  Nagpur  political gain  

Other Articles